English | Telugu

రజనీ కాంత్ కి చెన్నైలో ఘనస్వాగతం

రజనీ కాంత్ కి చెన్నైలో ఘనస్వాగతం ఏర్పాటుచేయటానికి ఆయన అభిమానులు వేలాదిగా ఎయిర్ పోర్టుకు చేరుకుంటారట. రజనీ కాంత్ సింగపూర్ నుండి చెన్నైకి ఈ రోజు సాయంత్రం వస్తున్నారు. రజనీ కాంత్ తాను హీరోగా నటిస్తున్న "రాణా" మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత రజనీ కాంత్ ఆరు వారాల పాటు సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్ సెంటర్ లోని ఇంటెన్సీవ్ కేర్ యూనిట్ లో ట్రీట్ మెంట్ తీసుకుని నేడు చెన్నైకి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివస్తున్న సందర్భంగా ఆయన అభిమానులు వేలాదిగా చెన్నై ఎయిర్ పోర్ట్ కు తరలి వస్తున్నారు.

ఆయన రాకతో కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో, రజనీ కాంత్ హీరోగా, దీపిక పదుకునే, ఇలియానా హీరోయిన్లుగా నటించబోయే "రాణా" చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే దీపిక పదుకునే డేట్లు ఖాళీ లేకపోవటంతో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజులు వాయిదా పడే అవకాశముంది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.