English | Telugu

మల్టీ డైమెన్షన్ కి ప్రిన్స్ మహేష్ దూకుడు నైజాం హక్కులు

మల్టీ డైమెన్షన్ కి ప్రిన్స్ మహేష్ బాబు"దూకుడు" నైజాం హక్కులు లభించాయని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్ గా, శ్రీనువైట్ల దర్శకత్వంలో, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం"దూకుడు". మహేష్ బాబు "దూకుడు"చిత్రం షుటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ రోజు ఒక గంట పాటు జరిగిన అనంతరం మాదాపూర్ లోని జయభేరీ క్లబ్ లో జరుగుతుంది.

గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "తీన్ మార్" చిత్రం యొక్క నైజాం పంపిణీ హక్కులను పొందిన మల్టీ డైమెన్షన్ సంస్థ మహేష్ బాబు"దూకుడు" చిత్రం యొక్క నైజాం పంపిణీ హక్కులను కూడా పొందింది. అందుకు ఆ సంస్థ తొమ్మిది కోట్ల భారీ మొత్తాన్ని చెల్లిస్తోందని తెలిసింది. మహేష్ బాబు"దూకుడు" సినిమా నైజాం హక్కుల కోసం గీతా ఆర్ట్స్ తరపున అల్లు అరవింద్, ఠాగూర్ మధు, ఆర్ ఆర్ మూవీస్ తరపున డాక్టర్ వెంకట్ తదితరులు పోటీపడినా చివరికి మల్టీ డైమెన్షన్ సంస్థ మహేష్ బాబు"దూకుడు" చిత్రం యొక్క నైజాం పంపిణీ హక్కులను పొందింది.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.