English | Telugu
171వ సినిమాకి రజనీకాంత్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
Updated : Nov 6, 2023
‘జైలర్’కి ముందు సరైన హిట్ లేక అల్లాడిపోయిన రజనీకాంత్ ఆ సినిమా సాధించిన ఘనవిజయంతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఎక్కడమేకాదు, ఏకంగా రూ.600 కోట్లకుపైగా కలెక్షన్ సాధించి పెట్టిన ఏకైక తమిళ హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. ప్రస్తుతం రజనీకాంత్ 171వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వరస విజయాలతో దూసుకెళ్తున్న లోకేష్ ఇప్పుడు రజనీ 171వ సినిమాని కూడా సూపర్‌హిట్ చేస్తాడన్న ధీమాతో ఉన్నారు రజనీ ఫ్యాన్స్.
ఇదిలా ఉంటే తాజాగా రజనీకాంత్‌కి సంబంధించిన ఒక వార్త వైరల్‌గా మారుతోంది. అదేమిటంటే.. తన 171వ సినిమాకి రజనీ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్. అందరూ ఆశ్చర్యపోయేలా రజనీకాంత్ ఈ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ రెమ్యునరేషన్ ఎంతంటే... అక్షరాలా రూ.260 కోట్లు. అందర్నీ షాక్‌కి గురి చేసే ఈ ఫిగర్ నిజంగానే రజనీ తీసుకుంటున్నాడా? నెటిజన్లు ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు. మరో వార్త ఏమిటంటే.. రూ.260 కోట్లు కాదు, రూ.280 కోట్లు అని. అయితే ఈ రెండు ఫిగర్స్‌లో ఏది కరెక్ట్ అయిన ఫిగరో ఎవ్వరికీ తెలీదు. ఇదే నిజమైతే ఆసియాలోనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా సూపర్‌స్టార్ రజనీకాంత్ రికార్డు క్రియేట్ చేసినట్టే. ‘జైలర్’ ప్రభంజనం చూసిన తర్వాత నిర్మాతలు కూడా అంత మొత్తంలో రెమ్యునరేషన్ చెల్లించేందుకు సిద్ధంగా ఉంటున్నారని తెలుస్తోంది. గతంలో జాకీ చాన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు రజనీ. ‘జైలర్’ చిత్రానికి సంబంధించి రూ.200 కోట్లు రెమ్యనరేషన్ తీసుకొని ఇండియాలోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.