English | Telugu

డాన్స్ మాస్టర్ నుంచి విశ్వ నటుడిగా ఎదిగిన నటుడి పుట్టిన రోజు 

భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించే గొప్ప నటుల్లో ఒకరు కమల్ హాసన్. ఆయన పేరు చెప్తే భారతీయ సినిమా ప్రేక్షకులు ఎంతగా మురిసిపోతారో సిల్వర్ స్క్రీన్ సైతం అంతే మురిసిపోతుంది. కళ అనే పదానికి పర్యాయ పదం కమల్ హాసన్ అని సగర్వంగా చెప్పుకోవచ్చు. తన నటనతో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన లోక నాయకుడు కమల్ నేటితో 69 సంవత్సరాలని పూర్తి చేసుకుంటున్నాడు.

తమిళనాడులో లార్జెస్ట్ టౌన్ అయిన పరమకుడి లో జన్మించిన కమల్ నేను పుట్టిందే నటన కోసం అనే రీతిలో 1960 లో కలాతూర్ కన్నమ్మ అనే సినిమాతో బాల నటుడుగా తమిళ చిత్ర రంగ ప్రవేశం చేసాడు. ఆ తర్వాత సినిమా రంగంలో కొన్నాళ్ళు డాన్సర్ గా కూడా పని చేసిన కమల్ 1975 లో వచ్చిన అపూర్వ రాగంగళ్ అనే చిత్రంతో తన నట విశ్వరూపానికి అంకురార్పణ చేసాడు .తన కంటే వయసులో చాలా రెట్లు పెద్దదైన ఆవిడతో ప్రేమలో పడి ఆమె ప్రేమలో మునిగిపోయే నవ యువకుడు గా కమల్ సూపర్ గా చేసి జాతీయ అవార్డు ని సైతం పొందాడు.

జీవ నదులు ఎలా అయితే భారత దేశాన్ని ఒకటిగా ఉంచుతున్నాయో కమల్ కూడా భారతదేశాన్ని ఒకటిగా ఉంచాలని అనుకున్నాడేమో ఆయన ఇతర భాషలకి సంబందించిన సినిమాల్లో కూడా నటించాడు . అలాగే అయన సినిమాలన్నీ కూడా అన్ని భాషల్లోను విడుదల అయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే 30 ఏళ్ళ క్రితమే కమల్ పాన్ ఇండియా హీరో గా విజృంభించాడు. మరో చరిత్ర , సాగరసంగమం, స్వాతి ముత్యం, నాయకుడు, పుష్పక విమానం, క్షత్రియ పుత్రుడు ,సత్య, విచిత్ర సోదరులు , గుణ ,తేవర్ మగన్,నమ్మవర్ ,మహానది, భారతీయుడు,హే రామ్, ఆళవందన్, అంబేశివం,విరుమాండీ, ద్రోహి ,దశావతారం ,విశ్వరూపం ఇలా ఎన్నో సినిమాల్లో తనదైన శైలిలో నటించి నటనకే నటనని నేర్పిన విశ్వ కధానాయకుడు గా కమల్ అవతరించాడు.ఐ యామ్ కమల్ హాసన్ ఫ్యాన్ అని ప్రతి ఒక్క కమల్ ఫ్యాన్ గర్వంగా చెప్పుకునేలా ఆయన నటన ఉంటుంది. అన్ని జోనర్ లకి సంబంధించిన కథల్లోనూ ఆయన నటించాడు. భగ్న ప్రేమికుడిగా, మంచి కొడుకుగా, నమ్ముకున్న వాళ్ళ కోసం అండగా నిలబడే గాడ్ ఫాదర్ గా, సమర్ధవంతమైన పోలీస్ ఆఫీసర్ గా, మంచి తండ్రిగా, సమాజాన్ని ఆలోచింప చేసే బాధ్యతాయుతమైన వ్యక్తిగా , శత్రువుల అటకట్టించే ఫ్యాక్షన్ లీడర్ గా ,మరుగుజ్జు వ్యక్తిగా, నృత్య కళాకారుడిగా ,స్వతంత్ర సమరయోధుడుగా ఇలా ఒకటి కాదు రెండు కాదు కళకి సంబంధించి ఎన్ని పాత్రలు ఉంటాయో అన్ని పాత్రలని కమల్ పోషించాడు . పాత్రలో కి పరకాయప్రవేశం చేసి ఆ పాత్ర గురించి భారతీయ సినిమా మొత్తం మాట్లాడుకునేలా చెయ్యడం కమల్ స్పెషాలిటీ. లేటు వయసులోను లేటెస్ట్ గా విక్రమ్ సినిమాతో భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు లని క్రియేట్ చేసాడు. తన సొంత నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటెర్నేషల్ బ్యానేర్ పై తన స్వీయ దర్శకత్వంలో కూడా కమల్ ఎన్నో చిత్రాలని నిర్మించాడు . ఆయన బహుముఖ ప్రజ్ఞా శాలి అనడానికి విశ్వరూపం మూవీనే ఒక ఉదాహరణ. మరికొన్ని రోజుల్లో భారతీయుడు 2 మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తనని ఇంతటి వాడిని చేసిన ప్రజల కి సేవ చెయ్యాలనే లక్ష్యంతో మక్కల్ నీది మయ్యం అనే రాజకీయ పార్టీ ని స్థాపించి రాజకీయ రంగంలో కూడా సంచలనం సృష్టించడానికి చూస్తున్న కమల్ హాసన్ గారికి మరో సారి మన తెలుగు వన్ తరుపున జన్మదిన శుభాకాంక్షలు. కమల్ సర్ సినిమా అనేది ఒక మతం అయితే ఆ మతానికి మీరు కూడా ఒక దేవుడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .