English | Telugu
రెండో పెళ్లి చేసుకున్న అమల.. ఫోటోలు వైరల్!
Updated : Nov 6, 2023
సినీ పరిశ్రమలో పెళ్ళి చేసుకోవడం, కొన్నాళ్ళు కాపురం చేయడం.. ఆ తర్వాత అభిప్రాయ భేదాల వల్ల విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైన విషయం. అలాగే రెండో పెళ్ళి చేసుకోవడం కూడా అంతే సహజం. అదే పద్ధతిలో ఇప్పుడు హీరోయిన్ అమలాపాల్ రెండో వివాహం చేసుకుంది. తన ప్రియుడు జగత్ దేశాయ్‌ని కొచ్చిలోని ఓ చర్చిలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్ళి చేసుకుంది అమల. పది రోజుల క్రితం వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. అంతకు కొద్దిరోజుల ముందు అమలాపాల్ పుట్టినరోజు వేడుకలో జగత్ దేశాయ్ ఆమెకు పెళ్ళి ప్రపోజల్ పెట్టాడు. ఆమె కూడా ఓకే చెప్పడంతో పెళ్లి బాట పట్టారు. అమలా పాల్ అంతకు ముందు తమిళ దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2014లో వీరి పెళ్లి జరిగింది. ఎక్కువ కాలం వీరిద్దరూ కలిసి జీవించలేకపోయారు. 2017లో విడాకులు తీసుకున్నారు. తర్వాతి నుంచి అమల సింగిల్‌గానే ఉంటోంది. 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది.
2009లో ‘నీల తామర’ అనే మలయాళ సినిమాతో నటిగా పరిచయమైంది. 2011లో నాగచైతన్య హీరోగా వచ్చిన ‘బెజవాడ’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది అమల.ప్రస్తుతం ఆమె మలయాళంలో రెండు సినిమాలు చేస్తున్నారు. ద్విజ అనే సినిమా శరావేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉండగా.. ఇంకో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.