English | Telugu

ర‌జ‌నీ అద‌ర‌గొట్టేశాడు

ర‌జ‌నీ కాంత్ అంటేనే అంత‌. అద్భుతాలు సైతం అత‌ని వంక వింత‌గా చూస్తుంటాయ్‌. లింగ రికార్డులే ఇందుకు నిదర్శ‌నం. లింగ‌లో విష‌యం ఏమీలేద‌ని విమ‌ర్శ‌కులు సైతం తేల్చేశారు. ఇదో పాత చింత‌కాయ్ ప‌చ్చ‌డ‌ని, మూడు గంట‌ల హింస అని ఘాటుగా విమ‌ర్శించారు. అయితే అభిమానులు మాత్రం.. త‌లైవా త‌లైవా.. అంటూ ఈ సినిమాని భుజాల‌నెత్తుకొన్నారు. మూడు రోజుల్లోనూ దాదాపుగా రూ.75 కోట్లు వ‌సూలు చేసింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఒక్క తొలి రోజే ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.30 కోట్లు రాబ‌ట్టింద‌ట‌. ఇది స‌రికొత్త సౌత్ ఇండియ‌న్ రికార్డు. ఓవ‌ర్సీస్‌లో అన్ని రికార్డుల‌ను ర‌జనీ చిత‌గ్గొట్టేస్తున్నాడ‌న్న టాక్ వినిపిపిస్తోంది. ''ఈ జోరెంత సేపూ.. సోమ‌వారం నుంచి వ‌సూళ్లు నేలకు దిగ‌డం ఖాయం'' అని విమ‌ర్శ‌కులు చెబుతున్నారు. మొత్తానికి తొలి మూడు రోజుల్లో ర‌జ‌నీ అద్భుతాలు సృష్టించాడు. మ‌రి ఈ జోరు ఆగుతుందా? లేదంటే ఈరోజు కూడా ర‌జ‌నీ దూకుడు చూపిస్తాడా అన్న‌ది బాక్పాఫీసు రిపోర్టులే చెప్పాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.