English | Telugu

షాక్‌కి గురి చేస్తున్న ర‌విబాబు స్ట్రాట‌జీ

రవిబాబుది ఓ డిఫరెంట్ స్టైల్. ప్ర‌చారానికి పెద్ద‌గా ప్రాధ‌న్యం ఇవ్వ‌డు. సినిమా అంతా ఒక్క పోస్ట‌ర్‌తోనే న‌డిపించేస్తాడు. అవును విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. పూర్ణ‌ని లొంగ‌దీసుకోవాల‌నుకొన్న ఓ ఏనుగు బొమ్మ ని సృష్టించి ఆ సినిమాకి ఆ ఒక్క పోస్ట‌రే వాడుకొన్నాడు. ఇప్పుడు అవును 2కీ అదే పంథాలో వెళ్తున్నాడు. అంతేకాదు, ''నా సినిమాకి ప‌బ్లిసిటీ అవ‌స‌రం లేదు. ర‌క‌ర‌కాల పోస్ట‌ర్లు పెట్టి నేనెవ‌రినీ క‌న్‌ఫ్యూజ్ చేయాల‌నుకోవ‌డం లేదు. సినిమాపేరు, న‌టీన‌టుల సంగ‌తి అర్థ‌మైతే చాలు...'' అంటున్నాడ‌ట‌. అంతేకాదు అవును 2 విష‌యంలో ప‌బ్లిసిటీ లేకుండా సినిమాని రంగంలోకి దింపుదామ‌నుకొంటున్నాడ‌ట‌. ఈ సినిమాఎప్పుడో పూర్త‌యింది. ఏవారం థియేట‌ర్లు ఖాళీగా ఉన్నాయో చూసుకొని, నాలుగు రోజుల ముందు ప‌బ్లిసిటీ మొద‌లెట్టి.. సినిమాని రిలీజ్ చేసేద్దామ‌నుకొంటున్నాడు. ఈచిత్రానికి సురేష్ బాబు నిర్మాత‌. ఆయ‌న త‌ల‌చుకొంటే థియేట‌ర్ల‌కు కొద‌వ ఉండ‌దు. అయినా స‌రే, రవిబాబు ఈత‌ర‌హా స్ట్రాట‌జీని ఎంచుకోవ‌డం ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్ని షాక్‌కి గురిచేస్తోంది. మ‌రి ఈ వింత పోక‌డ వ‌ర్క‌వుట్ అవుతుందంటారా??

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.