English | Telugu
రజనీ 'లాల్‌సలామ్' షూటింగ్ పూర్తి
Updated : Jul 12, 2023
సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్ కీ రోల్ చేస్తున్న సినిమా లాల్ సలామ్. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి ఆయన తనయ ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ త్రీ, వెయ్ రాజా వెయ్ అనే సినిమాలతో డైరక్టర్‌గా ప్రూవ్ చేసుకున్నారు ఐశ్వర్య రజనీకాంత్. గత కొన్ని నెలల క్రితమే లాల్ సలామ్ షూటింగ్ మొదలుపెట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో షూటింగ్ చేశారు.
నాన్‌స్టాప్‌గా చేసిన షూటింగ్‌తో చిత్రీకరణ పూర్తయింది. రజనీకాంత్ సినిమాను రికార్డు టైమ్‌లో కంప్లీట్ చేశారంటూ కాంప్లిమెంట్లు అందుతున్నాయి. జైలర్ మూవీలో ముత్తువేల్ పాండ్యన్‌గా కనిపిస్తున్న రజనీకాంత్, ఇప్పుడు లాల్‌సలామ్ సినిమాలో మొయిదీన్ భాయ్ గెటప్‌లో కనిపిస్తున్నారు. మొయిదీన్ భాయ్ గెటప్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో టీమ్ అంతా కలిసి తీసుకున్న ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. క్రికెట్‌లో రాజకీయాల ఆధారంగా తెరకెక్కిన సినిమా లాల్ సలామ్.
విష్ణువిశాల్, విక్రాంత్ కీ రోల్స్ చేశారు. ఇందులో రజనీకాంత్ డాన్ కేరక్టర్‌లో కనిపిస్తారు. ప్రముఖ నటీమణులు జీవిత, నిరోషా ఈ మూవీతో సిల్వర్‌స్క్రీన్ కమ్‌బ్యాక్ అవుతున్నారు. తంబిరామయ్య, సెంథిల్, తంగదురై ఇతర పాత్రల్లో నటించారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. లాల్ సలామ్ సినిమాలో లెజెండరీ క్రికెటర్ కపిల్‌దేవ్ కూడా కీ రోల్ చేశారు. రెహమాన్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. ఈ ఏడాది ఆఖరున విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్ని దశాబ్దాల తర్వాత ఈ సినిమాతో జీవిత సిల్వర్‌స్క్రీన్‌కి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీలో రజనీకాంత్ చెల్లెలిగా నటిస్తున్నారు జీవిత రాజశేఖర్.