English | Telugu
బాహుబలి కథ ఇలా పుట్టింది
Updated : Jun 22, 2015
బాహుబలి సినిమా విడుదల దగ్గరకు వస్తుండడంతో రాజమౌళి మీడియా ఇంట్రాక్షన్లు మొదలయ్యాయి. తొలిసారిగా ప్రింట్ మీడియాతో మాట్లాడారు. కానీ బాహుబలి కథకి సంబంధించిన కొత్త సంగతి ఒక్కటి కూడా జక్కన్న బయటపెట్టకపోవడం విశేషం. అయితే బాహుబలి కథ ఎలా తయారయ్యిందనేది మాత్రం ఆయన తెలియజేసాడు.
ఒక్కో పాత్రను తండ్రి నెరేట్ చేసారని, అవి బాగుండడంతో, వాటి చుట్టూ కథ అల్లామని చెప్పారు. ''నాన్నఅప్పుడెప్పుడో 'శివగామి' అనే పాత్ర గురించి చెప్పారు. నాకు భలే నచ్చేసింది. ఆయన చెప్పింది పాత్ర మాత్రమే. కథ లేదు, సన్నివేశాలేం లేవు. ఆ తరవాత.. భళ్లాలదేవ, కట్టప్ప పాత్రల గురించి చెప్పారు. ఈ పాత్రలన్నింటినీ కలుపుకొంటూ కథ రాస్తే బాగుంటుంది కదా.. అనిపించింది. అలా అనుకొన్న తరవాత రెండున్నర నెలల్లో 'బాహుబలి' కథ రెడీ అయిపోయింది. సినిమాలో ఏడెనిమిది పాత్రలు చాలా కీలకం. ప్రతి పాత్రకీ 'బాహుబలి' పాత్రతో సంబంధం ఉంటుంది. అలా కొన్ని పాత్రల నుంచి.. 'బాహుబలి' ఆలోచన, ఆ ఆలోచనల నుంచి కథ పుట్టుకొచ్చింద'న్నారు రాజమౌళి.