English | Telugu

గెట్ రెడీ డార్లింగ్స్.. రాజా సాబ్ వస్తున్నాడు!

ఇటీవల 'కల్కి'తో మరో బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). ప్రస్తుతం ఆయన చేతిలో 'రాజా సాబ్', 'సలార్-2', 'కల్కి-2', 'స్పిరిట్'తో పాటు హను రాఘవపూడి ప్రాజెక్ట్ ఉన్నాయి. వీటిలో ముందుగా ప్రభాస్ ఏ సినిమా పూర్తి చేస్తాడు? ఏది ముందు విడుదలవుతుంది? అని తెలుసుకోవడం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ మొదటి ఓటు 'రాజా సాబ్' కే అని తెలుస్తోంది.

ప్రభాస్ హీరోగా మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న మూవీ 'రాజా సాబ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా.. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆగష్టు నుంచి కొత్త షెడ్యూల్ మొదలు కానుందని సమాచారం. దీంతో పాటు పారలల్ గా హను రాఘవపూడి ప్రాజెక్ట్ చిత్రీకరణ కూడా జరగనుందని టాక్. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ చిత్రానికి 'ఫౌజీ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ మూవీ సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.

దాదాపు స్టార్ హీరోలంతా ఒక సినిమా పూర్తయ్యాక మరో సినిమా షూట్ లో పాల్గొంటున్నారు. కానీ ప్రభాస్ మాత్రం తన రూటే సెపరేట్ అంటూ దూసుకుపోతున్నాడు. అదే బాటలో ఇప్పుడు 'రాజా సాబ్'తో పాటు 'ఫౌజీ' షూట్ లో కూడా పాల్గొనబోతున్నాడట. అయితే వీటిలో ముందుగా 'రాజా సాబ్' విడుదల కానుందట. 'కల్కి' తర్వాత ప్రభాస్ నుంచి వచ్చే సినిమా ఇదే. వచ్చే ఏడాది జనవరిలో లేదా మార్చిలో 'రాజా సాబ్' విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.