English | Telugu

'గేమ్ ఛేంజర్'లో ఇన్ని పాటలా.. ఏ కాలంలో ఉన్నారు..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న పొలిటికల్ మూవీ 'గేమ్ ఛేంజర్' (Game Changer). శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై దిల్‌రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఇటీవల దిల్ రాజు ప్రకటించాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. 'గేమ్ ఛేంజర్' విడుదల కోసం మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ సాంగ్స్ కి సంబంధించిన అప్డేట్ ఆసక్తికరంగా మారింది.

'గేమ్ ఛేంజర్' సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ గా 'జరగండి జరగండి' విడుదలైంది. ఆగష్టులో సెకండ్ సింగిల్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ఈ మూవీలో మొత్తం ఏడు సాంగ్స్ ఉన్నాయనే న్యూస్.. హాట్ టాపిక్ గా మారింది. కమర్షియల్ సినిమాల ట్రెండ్ టైంలో ఒక్కో సినిమాలో ఖచ్చితంగా ఐదారు పాటలు ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. పాటల సంఖ్య తగ్గిపోయింది. ఉన్న పాటలు కూడా.. ఎక్కువగా థీమ్ సాంగ్సో, మాంటేజ్ సాంగ్సో ఉంటున్నాయి. అలాంటిది 'గేమ్ ఛేంజర్'లో ఏడు పాటలు అనే న్యూస్ ఆశ్చర్యం కలిగిస్తోంది.

'గేమ్ ఛేంజర్' నుంచి ఫస్ట్ సింగిల్ గా విడుదలైన 'జరగండి' సాంగ్ బాగానే ఉన్నప్పటికీ.. రెగ్యులర్ కమర్షియల్ సినిమా సాంగ్ లా ఉందని, రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ కి తగ్గట్టుగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో మిగతా సాంగ్స్ ఎలా ఉంటాయోనన్న ఆసక్తి నెలకొంది. మూవీ కంటెంట్ కి తగ్గట్టుగా థీమ్ సాంగ్సో, మాంటేజ్ సాంగ్సో ఉంటే ఓకే గానీ.. అన్ని పాటలు 'జరగండి' స్టైల్ లో ఉంటే మాత్రం రిస్క్ అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ఎటువంటి ఆందోళన అక్కర్లేదని సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. కొన్ని సాంగ్స్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వస్తాయని, అవి కథలో భాగంగానే ఉంటాయని అంటున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.