English | Telugu

పోలీసులకు పట్టుబడ్డ కొరియోగ్రాఫర్ రఘు

"ఆర్య-2", "మిర్చి' వంటి చిత్రాలలోని హిట్ పాటలకు కొరియోగ్రఫీని అందించిన కొరియోగ్రాఫర్ రఘుని ఇటీవలే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిలింనగర్‌లో ఓ పార్టీకి వెళ్లి వస్తున్న రఘు తప్పతాగి కారు నడుపుతూ ఉండటంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు అటుగా వచ్చిన రఘు కారుని ఆపి ఆయన్ని బ్రీత్ అనలైజర్‌తో టెస్ట్ చేశారు. ఈ పరీక్షలో రఘు మద్యం అధికమొత్తంలో తీసుకున్నాడని తేలడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎపి09 సిహెచ్5213 నెంబర్ గల అతని కారుని సీజ్ చేశారు. ప్రస్తుతం ఉన్న కొరియోగ్రాఫర్ లలో రఘు టాప్ 5స్థానంలో ఉన్నాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.