English | Telugu
పి.జె.శర్మ జన్మదిన వేడుకలు
Updated : May 24, 2012
పి.జె.శర్మ జన్మదిన వేడుకలు రామానాయుడు స్టుడియోలో ఘనంగా జరిగాయి. 1954 లో సినీ రంగంలోకి అడుగు పెట్టి నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా గణనీయమైన పెరు సంపాదించుకున్న సీనియర్ నటులు పి.జె.శర్మ గారి జన్మదిన వేడుకలు "సుకుమారుడు" ప్రారంభోత్సవంలో జరిగాయి. "సుకుమారుడు" చిత్రంలో హీరోగా నటిస్తున్న ఆది ఆయన మనవడు కావటం విశేషం. కాగా డైలాగ్ కింగ్ గా పేరుపడ్డ ప్రముఖ హీరో, ఆది తండ్రి సాయికుమార్ ఈ పి.జె.శర్మ గారి కుమారుడు.
ఈ జన్మదినోత్సవ వేడుకలకు తనికెళ్ళ భరణి, కె.వి.వి.సత్యన్నారాయణ, నటుడు రామ్ జగన్, సహ నిర్మాత బాబ్జి, ఆది, నిషా అగర్వాల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పి.జె.శర్మ గారితో కేక్ కట్ చేయించారు. ఆహూతులంతా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సంవత్సరంతో ఆయన 80 వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.