English | Telugu

పూరి జగన్నాథ్‌కి ఇది అగ్నిపరీక్షే... 28న అన్నీ చెప్పేస్తారట!

పవన్‌కళ్యాణ్‌, బాలకృష్ణ, మహేష్‌, ఎన్టీఆర్‌, రవితేజ వంటి హీరోలకు బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చిన డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌.. ఇప్పుడు చేతిలో సినిమాలు లేకుండా ఖాళీ అయిపోయారు. ప్రస్తుతం టాలీవుడ్‌ హీరోలెవరూ పూరితో సినిమా చేసేందుకు సిద్ధంగా లేరు. ఈ క్రమంలోనే రామ్‌తో ఇస్మార్ట్‌ శంకర్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ని తెరకెక్కించారు పూరి. అయినా టాలీవుడ్‌ హీరోలలో స్పందన లేకపోవడంతో విజయ్‌ దేవరకొండతో లైగర్‌ చిత్రాన్ని చేసి ఘోరంగా దెబ్బతిన్నారు. ఆ తర్వాత మరోసారి రామ్‌తో ఇస్మార్ట్‌ శంకర్‌కి సీక్వెల్‌గా చేసిన డబుల్‌ ఇస్మార్ట్‌ డబుల్‌ డిజాస్టర్‌ అయిపోయింది. దాంతో ఇక పూరి జగన్నాథ్‌ కెరీర్‌ ముగిసిపోయిందని అందరూ భావించారు.

హిట్‌ అయినా, ఫ్లాప్‌ అయినా ఒకేలా తీసుకునే పూరి జగన్నాథ్‌.. తన రూట్‌ని మార్చారు. ఇప్పటివరకు తెలుగు హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చిన పూరి... ఇప్పుడు తమిళ హీరో విజయ్‌ సేతుపతితో కలిసి తొలిసారి ఒక సినిమా చేస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను జెబి మోషన్‌ పిక్చర్స్‌ అధినేత జె.బి.నారాయణరావు.. కొండ్రోల్లా కొలాబరేషన్‌లో పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌ నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్‌ సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు పూరి జగన్నాథ్‌. సెప్టెంబర్‌ 28న ఈ సినిమాకి సంబంధించిన టైటిల్‌తోపాటు టీజర్‌ను కూడా రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. పూరి కెరీర్‌ ప్రారంభం నుంచి చేసిన సినిమాల టైటిల్‌ ఎంతో చిత్రం, మరెంతో విచిత్రం పెడుతుంటారు. మరి ఈ సినిమాకి ఏ టైటిల్‌ డిసైడ్‌ చేశారో తెలియాలంటే సెప్టెంబర్‌ 28 వరకు ఆగక తప్పదు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .