English | Telugu

ఛార్మితో రిలేషన్.. ఫైనల్ గా ఓపెన్ అయిన పూరి జగన్నాథ్!

ఒకప్పుడు టాలీవుడ్ లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే ఒక బ్రాండ్. ఇప్పటికీ ఆయనని అభిమానించే వారు ఎందరో ఉంటారు. ఒకానొక సమయంలో టాలీవుడ్ లో ఎన్నో సంచలనాలు సృష్టించిన పూరి.. ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్నారు. ముఖ్యంగా ఆయన గత రెండు చిత్రాలు 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' దారుణంగా నిరాశపరిచాయి. ప్రజెంట్ విజయ్ సేతుపతితో ఓ ఫిల్మ్ చేస్తున్న పూరి.. దాంతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. అభిమానులు కూడా ఆయన కమ్ బ్యాక్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే కొంతకాలంగా, పూరి కమ్ బ్యాక్ కోసం ఎంతలా చర్చ జరుగుతుందో.. అదే స్థాయిలో ఆయన రిలేషన్ షిప్ గురించి కూడా చర్చ జరుగుతోంది. (Puri Jagannadh)

ప్రస్తుతం పూరి జగన్నాథ్ వయసు 59 సంవత్సరాలు. 29 ఏళ్ళ క్రితం ఆయనకు పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూరి తనయుడు ఆకాష్ హీరోగా సినిమాలు కూడా చేస్తున్నారు. అలాంటిది పూరి, కొన్నేళ్లుగా హీరోయిన్ ఛార్మితో రిలేషన్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. (Charmy Kaur)

హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఛార్మి.. పదేళ్లుగా నటనకు దూరమయ్యారు. గత కొన్నేళ్లుగా పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. 2015 లో వచ్చిన 'జ్యోతిలక్ష్మి'తో వీరి ప్రయాణం మొదలైంది. 'రోగ్' నుంచి కంటిన్యూ అవుతోంది. బయట కూడా పూరి-ఛార్మి ఎప్పుడూ కలిసి కనిపిస్తుండటంతో.. వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ గుసగుసలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఛార్మి వయసు 38 ఏళ్ళు. ఇంకా పెళ్ళి కాలేదు. దీంతో ఛార్మి ప్రేమలో పూరి మునిగిపోయి, కుటుంబానికి దూరమయ్యారని ప్రచారం జరిగింది. వీరిద్దరూ పెళ్ళి కూడా చేసుకుంటారంటూ వార్తలొచ్చాయి. అయితే ఈ గాసిప్స్ పై ఇంతకాలం సైలెంట్ గా పూరి.. ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు. అందరూ అనుకున్నట్టు తమ మధ్య ఏమీ లేదని, తాము ఫ్రెండ్స్ మాత్రమేనని స్పష్టం చేశారు.

ఛార్మితో రిలేషన్ పై తాజాగా పూరి స్పందించారు. ఛార్మి తనకు 13 ఏళ్ళ వయసు నుండి తెలుసని, దాదాపు 20 ఏళ్లుగా తమ మధ్య స్నేహం ఉందని తెలిపారు. మా మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ ప్రచారం జరుగుతుంది. కానీ, మా మధ్య ఎలాంటి రొమాంటిక్ రిలేషన్ లేదని పూరి అన్నారు. ఛార్మి యంగ్.. ఆమెకు ఇంకా పెళ్ళి కాలేదు.. అందుకే ఇలాంటి గాసిప్స్ వస్తున్నాయి. అదే ఛార్మికి 50 ఏళ్ళు ఉంటే, ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ అయ్యేవా? అని పూరి ప్రశ్నించారు. తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని, అది శాశ్వతంగా ఉంటుందని పూరి స్పష్టం చేశారు. మరి పూరి ఇచ్చిన ఈ క్లారిటీతోనైనా.. ఇక ఆ రూమర్స్ కి చెక్ పడుతుందేమో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .