English | Telugu
పవన్ కళ్యాణ్ హ్యాండ్ పడింది.. దశ తిరిగింది!
Updated : Nov 16, 2023
2019లో వచ్చిన 'గ్యాంగ్ లీడర్'తో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన ప్రియాంక మోహన్ ఆ తర్వాత 'శ్రీకారం'లో నటించింది. ఆ రెండు చిత్రాలతో ప్రియాంక తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినప్పటికీ.. ఎందుకనో ఆమెకి అవకాశాలు రాలేదు. దీంతో తమిళ్ పైనే ఫోకస్ పెట్టింది. తమిళ్ లో ప్రియాంక 'డాక్టర్', 'ఈటీ', 'డాన్' వంటి సినిమాల్లో నటించింది. అలాగే 'కెప్టెన్ మిల్లర్'లో నటిస్తోంది. అయితే ఇప్పుడు సడెన్ గా టాలీవుడ్ మేకర్స్ దృష్టి ప్రియాంకపై పడింది.
తెలుగులో ఇప్పటికే ఒక బడా మూవీలో హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది ప్రియాంక. అదే పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఓజీ'. ఈ గ్యాంగ్ స్టర్ మూవీలో హీరోయిన్ గా ప్రియాంక నటిస్తున్నట్లు ప్రకటన వచ్చినప్పుడు అందరూ సర్ ప్రైజ్ అయ్యారు. అదే సమయంలో పవన్-ప్రియాంక జోడి కొత్తగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ప్రియాంక ఏ ముహూర్తాన పవన్ కళ్యాణ్ తో 'ఓజీ'లో నటించడానికి అంగీకరించిందో కానీ ఈ సినిమాతో ఆమె దశ తిరిగిందని చెప్పొచ్చు. తెలుగులో ఆమెకి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి.
ప్రియాంకకు తెలుగులో చెప్పుకోదగ్గ హిట్ లేదు. అయినప్పటికీ ఆమె ప్రస్తుతం పవన్ సరసన నటిస్తుండటంతో.. టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే నాని సరసన 'సరిపోదా శనివారం' సినిమా చేస్తోంది. 'గ్యాంగ్ లీడర్' తరవాత నాని, ప్రియాంక కలయికలో వస్తున్న రెండో చిత్రమిది. అలాగే రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందనున్న నాలుగో సినిమాలో నటించనుంది. వీటోతోపాటు మరో రెండు చిత్రాల కోసం అగ్ర నిర్మాణ సంస్థలు ప్రియాంకను సంప్రదించినట్లు సమాచారం.