English | Telugu

అనుష్క కోసం... రాఘ‌వేంద్రరావు రిక‌మెండేష‌న్‌

అరుంధ‌తితో అనుష్క రేంజే మారిపోయింది. అది ఇప్పట్లో దిగేలా క‌నిపించ‌డంలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు ఇప్పుడు స్వీటీనే ఆధార‌మైపోయింది. పంచాక్షరి, వ‌ర్ణ సినిమాలు బ్లాస్ట్ అయినా, అనుష్క బ్లాక్ బ్లస్టర్ సినిమాలు చేయ‌గ‌ల‌ద‌న్న న‌మ్మకంతో ద‌ర్శకులు క‌థ‌లు రెడీ చేసుకొంటున్నారు. ఇప్పుడు రాఘ‌వేంద్రరావు త‌న‌యుడు ప్రకాష్ కోవెల‌మూడి కూడా అనుష్క కోసం ఓ భారీ క‌థని రెడీ చేసుకొన్నట్టు ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌. నీతో అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రకాష్‌. ఆ సినిమా తుస్సుమంది. ఆ త‌ర‌వాత బొమ్మలాట తీసి భేష్ అనిపించుకొన్నాడు. అన‌గ‌న‌గా ఓ ధీరుడు మాత్రం మ‌ళ్లీ నిరాశ ప‌రిచింది. ఇంత కాలానికి ఓ క‌థ‌ని రెడీ చేశాడ‌ట‌. ఇది కూడా మినిమం 50 కోట్ల రేంజ్ ఉన్న క‌థేన‌ని టాక్‌. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో అనుష్క అయితేనే బాగుంటుంద‌ని ప్రకాష్ ఫిక్సయ్యాడు. ఇప్పుడు ప్రకాష్ క‌థ చెబుతానంటే... అనుష్క వినే స్థితిలో ఉందా?? అందుకే త‌న‌యుడు కోసం రాఘ‌వేంద్రరావు సైతం రంగంలోకి దిగ‌బోతున్నట్టు స‌మాచార‌మ్‌. రాఘ‌వేంద్రర‌రావు రిక‌మెండేష‌న్‌తో స్వీటీ ఈ సినిమా చేయ‌డానికి ముందుకొచ్చే అవ‌కాశాలున్నాయి.

అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. లేడీఓరియెంటెడ్ సినిమాల‌కు దూరంగా ఉండాల‌ని అనుష్క నిర్ణయం తీసుకొంది. వ‌ర్ణ సినిమా ఎఫెక్ట్ అలా ప‌నిచేసింది. పైగా రుద్రమ‌దేవి, బాహుబ‌లి సినిమాల‌కు భారీ కాల్షీట్లు ఇవ్వడం వ‌ల్ల కొన్ని సినిమాల్ని వ‌దులుకోవ‌ల‌సి వ‌చ్చింది. ప్రకాష్ సినిమాని ఒప్పుకొంటే దాదాపు ఏడాది పాటు డేట్లు ఇవ్వాల్సి ఉంటుంది. మ‌రి అనుష్క అందుకు సిద్దంగా ఉంటుందా?? లేదంటే క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో క‌థానాయిక పాత్ర చాలు అంటుందా?? అన్నది ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి రాఘ‌వేంద్రరావు రిక‌మెండేష‌న్ ఎంత గ‌ట్టిగా ప‌నిచేస్తుందో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .