English | Telugu
ప్రభాస్ తో లోకేశ్ మూవీ.. మాములుగా ఉండదు మరి!
Updated : Aug 1, 2023
'బాహుబలి' సిరీస్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. వరుస పాన్ ఇండియా మూవీస్ తో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 'సాహో', 'రాధే శ్యామ్', 'ఆదిపురుష్' చిత్రాలతో పలకరించిన ప్రభాస్.. త్వరలో 'సలార్', 'కల్కి 2898 ఎడి' సినిమాలతో సందడి చేయనున్నారు. ఈ రెండు చిత్రాలు కూడా రెండేసి భాగాలతో ఎంటర్టైన్ చేయనున్నాయి. ఇక మారుతి దర్శకత్వంలో ఓ సినిమా.. సందీప్ వంగ డైరెక్షన్ లో 'స్పిరిట్' కూడా ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. 'ఖైదీ', 'మాస్టర్', 'విక్రమ్' చిత్రాల దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్ లో ప్రభాస్ ఓ భారీ బడ్జెట్ మూవీ చేయనున్నారని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమాకి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బాణీలు అందించనున్నారని సమాచారం. అలాగే దసరా సమయంలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ వార్తలో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. ఏదేమైనా.. ప్రభాస్ తో లోకేశ్ మూవీ అంటే మామూలుగా ఉండదనే చెప్పొచ్చు.
కాగా, లోకేశ్ కనకరాజ్ తాజా చిత్రం 'లియో' అక్టోబర్ 19న థియేటర్స్ లోకి రానుంది. ఇందులో విజయ్, త్రిష జంటగా నటించారు. అనిరుధ్ సంగీతమందించాడు.