English | Telugu

ప్రభాస్ ఆవిష్కరించిన సూపర్ హిట్ పత్రిక

ప్రభాస్ ఆవిష్కరించిన "సూపర్ హిట్" పత్రిక అంటే దానర్థం ఏమిటి...? తెలుగు సినీ పరిశ్రమలో "సూపర్ హిట్" పత్రిక ప్రవేశించి ఇరవై యేళ్ళకు పైగానే అయ్యింది. అంత పేరున్న సీనియర్‍ పత్రికని నిన్న మొన్న వచ్చిన యంగ్ రెబెల్ స్టార్ ఆవిష్కరించటం ఏంటనేగా మీ అనుమానం. వివరాల్లోకి వెళితే "సూపర్ హిట్" పత్ర్క పెట్టి రెండు దశాబ్దాలయిన సందర్భంగా "సూపర్ హిట్" పత్రిక ఇంగ్లీష్ ఎడిషన్ ని ప్రత్యేకంగా విడుదల చేశారు బి.ఎ.రాజు, బి.జయ. ఈ "సూపర్ హిట్" పత్రిక ప్రత్యేక ఇంగ్లీష్ ఎడిషన్ని యువ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.

ఈ పత్రికను ఆవిష్కరించిన అనంతరం హీరో ప్రభాస్ మాట్లాడుతూ "నా తొలి చిత్రం "ఈశ్వర్" నుండీ సూపర్ హిట్ పత్రితో, బి.ఎ.రాజు గారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన సినియర్ జర్నలిస్ట్ మాత్రమే కాక నిర్మాత, సూపర్ హిట్ వంటి నంబర్‍ వన్ పత్రికకు అధిపతి, అజాతశతృవు, మంచి మనసున్న మనిషి. ఈ పత్రిలో వచ్చే అన్నీ వార్తలనూ నేను నమ్ముతాను. రాజుగారి మీద, ఆయన పత్రిక మీద నాకే కాదు, తెలుగు సినీ పరిశ్రమలోని వారందరికీ , ఇంకా చెప్పాలంటే తెలుగు ప్రేక్షకులందరికీ నమ్మకముంది. అంత విశ్వాసాన్ని వారు సంపాదించటం చాలా సంతోషం. వారి పత్రిక మరిన్ని దశాబ్దాల పాటు ఇలాగే నంబర్ వన్ పత్రికగానే ఉండాలనీ, ఉంటుందనీ ఆశిస్తున్నాను" అని అన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.