English | Telugu

మే 14 న బ్రహ్మానందానికి "మా" టి.వి. సన్మానం

"మే" 14 న బ్రహ్మానందానికి "మా" టి.వి. సన్మానం జరపబోతుంది. వివరాల్లోకి వెళితే గత ఇరవై అయిదు సంవత్సరాలుగా, తొమ్మిది వందల సినిమాల్లో విశేషంగా నవ్వుల పువ్వులు పూయించి హాస్యానికి చిరునామాగా మారిపోయిన బ్రహ్మానందానికి ప్రముఖ శాటిలైట్ ఛానల్ "మా" టి.వి. "మే" నెలలో 14 వ తేదీన, హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్లో ఘనంగా సన్మానించనుంది. ఈ ఇరవై అయిదేళ్ళ కాలంలో బ్రహ్మానందం ప్రతి సినిమాలో తను ధరించిన పాత్రలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ, ఇన్నేళ్ళుగా తనముఖాన్ని ప్రేక్షకులు చూస్తున్నా కూడా బోర్ కొట్టకుండా చూసుకోవటమే కాకుండా, "ఈ సినిమాలో బ్రహ్మానందం ఉన్నాడా...?" అని అడిగి మరీ సినిమాకి వెళ్ళే స్థాయికి బ్రహ్మానందం ఎదిగాడనే చెప్పాలి.

అంతే కాకుండా సినీ రచయితలంతా బ్రహ్మానందం కోసం ప్రత్యేకంగా పాత్రలను సృష్టించేలా చేసుకున్నాడు బ్రహ్మానందం. అలాగే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తన్హ పేరు నమోదుచేసుకుని, భారత ప్రభుత్వం చేత "పద్మశ్రీ" బిరుదునందుకుని, గౌరవ "డాక్టరేట్"ను కూడా సంపాదించుకున్న అత్యుత్తమ హాస్యనటుడు పద్మశ్రి, డాక్టర్‍ బ్రహ్మానందానికి ప్రముఖ శాటిలైట్ ఛానల్ "మా" టి.వి. "మే" నెలలో 14 వ తేదీన, హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్లో ఘనంగా సన్మానం చేయటం ముదావహం.