English | Telugu
ఈ దసరా ప్రభాస్ అభిమానులకు నిజంగా పండగే.. ఎందుకో తెలుసా?
Updated : Sep 20, 2024
సలార్, కల్కి వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హీరోగా ప్రభాస్ ఏ రేంజ్‌కి వెళ్లిపోయారో తెలిసిందే. ఈ రెండు యాక్షన్ ఎంటర్‌టైనర్స్ తర్వాత మారుతి డైరెక్షన్‌లో చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రాజాసాబ్‌తో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ సినిమా జరుగుతుండగానే హను రాఘవపూడి కాంబినేషన్‌లో ఫౌజీ చిత్రం చేస్తున్నట్టు ఎనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇలా గ్యాప్ లేకుండా వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ప్రభాస్ లైనప్‌లో సందీప్‌రెడ్డి వంగాతో చేసే స్పిరిట్ కూడా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న టాప్ హీరోల్లో ప్రభాస్ స్పీడ్‌గా ఉన్నాడని అర్థమవుతోంది. ఫౌజీ పూజా కార్యక్రమాలు జరుపుకోవడమే కాదు, మధురైలో ఈ సినిమా షూటింగ్‌ని కూడా మొదలు పెట్టేశారు. ప్రస్తుతం ప్రభాస్ లేని సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు హను రాఘవపూడి.
ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్‌లో ఉన్న ప్రభాస్ అది పూర్తి చేసుకొని ఫౌజీ సెట్స్‌కి వెళతారు. హను రాఘవపూడి పక్కా ప్లానింగ్‌తో ఫౌజీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్‌కి వున్న ఇమేజ్‌ని, మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సినిమానీ హై బడ్జెట్‌లోనే నిర్మిస్తున్నారు. అలాగే ఫౌజీని కూడా 1945 జరిగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తుండడంతో దాని బడ్జెట్ కూడా వందల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాజా సాబ్‌కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాకపోయినా, దాని తర్వాత స్టార్ట్ అయిన ఫౌజీకి సంబంధించి మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రాబోతోందనే సమాచారం అందుతోంది. ఈ దసరాకి ఫౌజీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌గానీ, టీజర్‌గాని వదులుతారని తెలుస్తోంది.
డైరెక్టర్ హను రాఘవపూడి ఫౌజీ లుక్‌ని, టీజర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలుస్తోంది. ఈలోగా రాజాసాబ్ షూటింగ్ పూర్తయినా, కాకపోయినా హను సూచన మేరకు ప్రభాస్ ఫౌజీ సెట్స్‌కి వెళ్ళే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం సెట్స్‌లో ఉన్న రాజా సాబ్, ఫౌజీ.. ఈ రెండూ ఒక దానికొకటి సంబంధం లేని సబ్జెక్ట్స్. రెండు భిన్నమైన కథలతో వస్తున్న ఈ సినిమాలు ప్రేక్షకుల్ని ఏ మేర అలరిస్తాయో చూడాలి. ఇదిలా ఉంటే.. సలార్2, కల్కి2 చిత్రాలు కూడా ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ ఇప్పటివరకు బయటికి రాలేదు. ఎప్పుడు షూటింగ్ చేస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయంలో కూడా క్లారిటీ లేదు. ఆ తర్వాత స్పిరిట్ ఉండనే ఉంది. మరి ఈ సినిమాలన్నీ పూర్తి కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.