English | Telugu

నాగబాబు కి కూడా ఒక కూతురు ఉందనే విషయం మర్చిపోవద్దు

ఉషాకిరణ్ మూవీస్ నుంచి వచ్చిన నచ్చావులే అనే మూవీతో హీరోయిన్ గా తెరంగ్రేటం చేసిన మాధవి లత(madhavi latha)గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు.చాలా కాలం నుంచి చిత్ర పరిశ్రమకి సంబంధించి గాని, బయట సొసైటీ కి సంబంధించి గాని జరిగే అన్యాయాలపై తన వంతుగా పోరాటాలు చేస్తు సోషల్ మీడియా వేదికగా అందుబాటులోనే ఉంది . రీసెంట్ గా జానీ మాస్టర్ ఇష్యూ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.

నాగబాబు(nagababu)గారు జానీ మాస్టర్ కి సపోర్ట్ గా పోస్ట్ చెయ్యడంతో నేను చాలా బాధపడ్డాను. నాగబాబు గారికి కూడా ఒక కూతురు ఉంది.పైగా తన కూతురు కంటే బాధిత అమ్మాయిది చాలా చిన్న వయసు. అలాగే మహాసేన రాజేష్ అనే వ్యక్తి జానీ మాస్టర్ కి సపోర్ట్ గా మాట్లాడుతు తన ఫాలోవర్లు ని తప్పు దారి పట్టిస్తున్నాడు.ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం ఇది. జానీ అనే వ్యక్తి మీ వరకు మంచి వాడు కావచ్చు.కానీ ఆ అమ్మాయి విషయానికి వచ్చే సరికి మంచి వ్యక్తి కాదు. బాధిత అమ్మాయి పదహారేళ్ల వయసులో ఉన్నపుడు జానీ మాస్టర్ ప్రేమ మాటలకి మోసపోయింది.కేవలం ఒక ఆరునెలలు మాత్రమే జానీ తో రిలేషన్ లో ఉంది. ఆ తర్వాత అతని నిజ స్వరూపం తెలుసుకొని బయటకి వచ్చి ఇండిపెండెంట్ గా వర్క్ చేసుకుంటుంది. కానీ జానీ మాస్టర్ మాత్రం ఆ అమ్మాయిని చాలా టార్చర్ చేసాడు.నువ్వు లేకుండా నేను బతకలేను అంటు షూటింగ్ ల దగ్గరకి వెళ్లి గొడవ చేసేవాడు.

పైగా చాలా సార్లు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ తెలుసుకొనే మూవీ ఛాంబర్ పెద్దలు జానీ మాస్టర్ ని సస్పెండ్ చేసారు. టాలెంట్ వేరు క్యారక్టర్ వేరు.. పుష్ప 2 సెట్స్ లో గొడవ జరగడం వలన అల్లు అర్జున్, సుకుమార్ లకి కూడా ఈ విషయం తెలుసు.అందుకే ఆ అమ్మాయికి సపోర్ట్ గా ఉన్నారు. ఏది ఏమైనా ఒక ఆడపిల్లకి ఇష్టం లేనప్పుడు నన్ను ప్రేమించు ప్రేమించు అని ఆమెని హరాస్ చేయడం చాలా పెద్ద తప్పు. అందుకు తగ్గ ఆధారాలన్నీ వాట్స్ అప్ చాటింగ్ లో ఉన్నాయని చెప్పుకొచ్చింది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.