English | Telugu

ఒకేసారి పలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో స్ట్రీమ్ అవుతున్న 'కన్యక' మూవీ

శ్రీ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్ నిర్మించిన చిత్రం 'కన్యక'. ఎయిర్‌‌టెల్ ఎక్స్‌‌స్ట్రీమ్, హంగామా, టాటా ప్లే బిన్జ్, వాచో, విఐ మూవీస్ టీవీ ఇంకా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో స్ట్రీమింగ్ అవుతోంది.

విశ్వనాథ శాస్త్రి అనే ఒక బ్రాహ్మణోత్తముని కూతురు కన్యక కనిపించకుండా పోతుంది. ఆ అమ్మాయి లేచి పోయిందా లేదా ఎవరైన చంపేసారా అని శ్రావ్య అనే అమ్మాయి ఆ ఊరి కొచ్చి విశ్వనాథ శాస్త్రి ఇంటిలోనే ఉంటూ ఇన్విస్టిగేట్ చేస్తుంది. కన్యక ఏమైంది? వచ్చిన అమ్మాయి ఎవరు? చివరి వరకు అసలు ఏం జరిగింది? అని సస్పెన్స్ కథాంశంతో.. మనం చేసిన తప్పులను ఒక కన్ను గమనిస్తుంది అని మెసేజ్ తో నడిచే ఈ సినిమా ని నకరికల్లుప్రాంత వాసులైన నిర్మాతలు కెవి అమరలింగేశ్వరరావు, ఆతుకూరి సాంబశివరావు, కూరపాటి పూర్ణచంద్ర రావు నిర్మించారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. మొదటి సినిమానే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేసినందుకు ఆనందంగా ఉందని, నకరికల్లు వాసవి కన్యక టెంపుల్ లో అమ్మవారి మీద చిత్రీకరించిన పాట హైలట్ అని, కుటుంబం మొత్తం కలిసి చూడగలగిన చక్కని చిత్రం అని పేర్కొన్నారు.

దర్శకుడు రాఘవ మాట్లాడుతూ.. ఆడవారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే ఎవరు క్షమించినా అమ్మవారు క్షమించదు శిక్షిస్తుందని ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నామని, సినిమా చాలా తక్కువ రోజుల్లో తక్కువ బడ్జెట్ లో ఫినిష్ చేసామని, షూటింగ్ కు నకరికల్లు మరియు చాగంటి వారి పాలెం వాసులు మాకు ఎంతో సహకరించారని చెప్పారు. చిత్ర ట్రైలర్, వీడియో సాంగ్ యూ ట్యూబ్ లో రిలీజైన రోజు నుండి ట్రెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ సినిమాలో శివరామరాజు, జబర్దస్త్ వాసు, ఈశ్వర్, శ్రీహరి , PVL వర ప్రసాదరావు, సర్కార్,ఫణిసూరి, RMP వెంకటశేషయ్య, సాలిగ్రామం మమత ,శిరీష , విజయ , రేవతి తదితరులు నటించారు. ఈ చిత్రానికి అర్జున్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్స్ గా రాము, తరుణ్, ఎడిటర్ గా సుభాన్ వ్యవహరించారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.