English | Telugu

ప్రభాస్‌ పేరు మార్చుకున్నాడా.. ఇదిగో క్లారిటీ వచ్చేసింది!

‘సలార్‌’తో మరోసారి తన సత్తా ఏమిటో చూపించిన ప్రభాస్‌ ఇప్పుడు నెక్స్‌ట్‌ సినిమాలపై ఫోకస్‌ పెట్టాడు. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ప్రభాస్‌ చేస్తున్న కల్కి 2898 ఎ.డి. చిత్రంలో ఓ డిఫరెంట్‌ లుక్‌లో చిన్న పిల్లలని టార్గెట్‌ చేసాడు. వారికి చక్కని ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు రెడీ అయ్యాడు. ఇక మారుతి డైరెక్షన్‌లో చేస్తున్న కొత్త సినిమా ‘ది రాజా సాబ్‌’ చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్‌ చేసి వారికి కూడా ఆనందాన్ని అందించబోతున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. అయితే ఈ పోస్టర్‌ చూసి అందరూ షాక్‌ అవుతున్నారు.

ఎందుకంటే ది రాజా సాబ్‌ అనే టైటిల్‌ పైన ప్రభాస్‌ పేరు విచిత్రంగా ఉండడమే దీనికి కారణం. పేరు చివరలో ఎస్‌ అనే అక్షరం రెండుసార్లు కనిపించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా న్యూమరిక్‌ ఆస్ట్రాలజీని నమ్మేవారు మాత్రమే తమ పేరును ఇంగ్లీష్‌లో రాసినపుడు రెగ్యులర్‌గా వాడే అక్షరాలకు భిన్నమైన అక్షరాలను వాడడం లేదా ఒకే లెటర్‌ను రెండుసార్లు రాయడం చేస్తుంటారు. ఈ సినిమాకి ప్రభాస్‌ పేరును కూడా ఆ ఉద్దేశంతోనే మార్చారా అనేది అందరి డౌటు. ప్రభాస్‌ విషయంలో అలాంటి అవకాశమే లేదని కొందరంటున్నారు. ఎందుకంటే ప్రభాస్‌కి జ్యోతిష్యం మీద అస్సలు నమ్మకం లేదని గతంలోనే ఓ సందర్భంలో చెప్పారు.

అయితే ప్రభాస్‌ పేరును అలా రాయడంలో అసలు ఉద్దేశం ఏమై ఉంటుందని అందరూ చర్చించుకుంటున్నారు. దీనిపై సోషల్‌ మీడియలో కూడా డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. ప్రభాస్‌ పేరును ఇంగ్లీష్‌లో రాయాల్సి వచ్చినపుడు ఒక ఎస్‌ను చివరలో అదనంగా చేర్చాలని, ఇకపై ప్రబాస్‌ని అలాగే పిలవాలని కొందరి వాదన. ది రాజా సాబ్‌కి సంబంధించి ప్రభాస్‌ పేరు ఒక హాట్‌ టాపిక్‌గా మారడంతో దీనిపై మారుతి కాంపౌండ్‌ నుంచి విశ్వసనీయంగా ఓ క్లారిటీ వచ్చింది. అదేమిటంటే.. ప్రభాస్‌ పేరు మార్చుకోలేదని, టెక్నికల్‌గా జరిగిన మిస్టేకే తప్ప ఇందులో మరో ఆలోచన లేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో ప్రబాస్‌ పేరుకి సంబంధించిన డిస్కషన్స్‌కి ఫుల్‌స్టాప్‌ పడిరది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.