English | Telugu

ప్రభాస్‌, మారుతి టార్గెట్‌ అదే.. రెండు నెలల్లో తేలిపోతుందట!

‘కల్కి’ రిలీజ్‌కి ముందే ఇటలీలోని తన ఇంటికి వెళ్లి సినిమా సూపర్‌ సక్సెస్‌ని అక్కడే ఎంజాయ్‌ చేశాడు. రెండు వారాలు అక్కడ స్పెండ్‌ చేసిన తర్వాత హైదరాబాద్‌ చేరుకున్నాడు. ఇప్పుడు నెక్స్‌ట్‌ ఏంటి? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. మారుతి దర్శకత్వంలో పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ‘రాజాసాబ్‌’ చిత్రానికి మొదట ప్రిఫరెన్స్‌ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాకి ప్రభాస్‌ పనిచేసింది తక్కువ రోజులే. అయినా ప్రభాస్‌ కోసమే ఎదురుచూడకుండా అతను లేకుండా తియ్యాల్సిన సన్నివేశాలను పూర్తి చేశాడు మారుతి. కేవలం ప్రభాస్‌ ఉంటేనే తప్ప తియ్యలేని షాట్స్‌ అనేకం ఉన్నాయి. అందుకే ‘రాజాసాబ్‌’ని పూర్తి చెయ్యడానికే ప్రభాస్‌ ఫిక్స్‌ అయ్యాడని తెలుస్తోంది.

సలార్‌2, కల్కి2 చిత్రాల షూటింగ్స్‌ ఇప్పట్లో లేవు. అలాగే హను రాఘవపూడితో అనుకున్న సినిమా కూడా సెట్స్‌పైకి వెళ్ళేందుకు మరికొంత సమయం పడుతుంది. అందువల్ల ప్రభాస్‌ ముందు ఉన్న ఒకే ఒక ఆప్షన్‌ ‘రాజా సాబ్‌’ని పూర్తి చేయడమే. ఈనెలాఖరులో కొత్త షెడ్యూల్‌ ప్రారంభమవుతుందట. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నారు. కాబట్టి ప్రభాస్‌ ఓ రెండు నెలలు ఈ సినిమా కోసం కేటాయిస్తే సినిమా షూటింగ్‌ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. మరి ప్రభాస్‌, మారుతి ఏ నిర్ణయం తీసుకుంటారో, షూటింగ్‌ ఎప్పుడు మొదలు పెడతారో తెలియాలంటే కొన్నిరోజులు వేచి వుండక తప్పదు

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .