English | Telugu

పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రం సినిమా

పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రం సినిమా ప్రారంభం కావచ్చని సినీ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే ఇటీవల నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ కలసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, తమిళ దర్శకుడు విష్ణువర్థన్ రెడ్డి దర్శకత్వంలో "పంజా" అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించక పోవటంతో వారికి మరో సినిమా చేయటానికి హీరో పవన్ కళ్యాణ్ అంగీకరించారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.

ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించబోతున్నారని కూడా వినపడుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో,అల్లు అరవింద్ నిర్మించిన "జల్సా" సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఆ సినిమా తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇదే కావటంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొంటాయి.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.