English | Telugu

మరో యాడ్ లో ప్రిన్స్

మరో యాడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు నటించనున్నాడని తెలిసింది. వివరాల్లోకి వెళితే ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పటికే చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అంటే థమ్సప్, యూనివర్సెల్, ఐడియా సెల్యూలర్, అమృతాంజన్ పెయిన్ బామ్, వివెల్ షాంపూ, జాస్ అలూకాస్ వంటి కంపెనీలకు ప్రిన్స్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ప్రస్తుతం లేటెస్ట్ గా సంతూర్ సబ్బుకి ప్రిన్స్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయబోతున్నారని తెలిసింది.

ఈ సంతూర్ సబ్బు యాడ్ త్వరలో చిత్రీకరించనున్నారు. ఈ యాడ్ కి ప్రముఖ సినీ స్టార్ రచయిత కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా వ్యవహరిస్తారని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం. ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "బిజినెస్ మ్యాన్" చిత్రం జనవరి 11 వ తేదీన, సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానుంది.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.