English | Telugu

పీయ‌స్‌2... నెల రోజులు ప‌క్కా ప్ర‌మోష‌న్‌!

ఒక‌ప్పుడు సినిమా తీయ‌డం అంటే కాంబినేష‌న్ సెట్ చేసుకోవ‌డం, ప్రీ ప్రొడ‌క్ష‌న్ చేసుకోవ‌డానికే ఎక్కువ టైమ్ ప‌ట్టేది. ఒక్క‌సారి సినిమా ప‌ట్టాలెక్కితే, ఇక అంతా స‌జావుగా సాగిపోతుంద‌ని అనుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. కాంబో సెట్టింగ్‌, ప్రీ ప్రొడ‌క్ష‌న్‌, షూటింగ్ కూడా న‌ల్లేరు మీద న‌డ‌క‌లా జ‌రిగిపోతోంది. కానీ ఆ త‌ర్వాత విష‌యాల మీదే ఎక్కువ‌గా ఫోక‌స్ చేయాల్సి వ‌స్తోంది.మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా పొన్నియిన్ సెల్వ‌న్. ఈ చిత్రం ఫ‌స్ట్ పార్టు షూటింగులో ఉన్న‌ప్పుడే, సెకండ్ పార్టుకు సంబంధించి కూడా మేజ‌ర్ పోర్ష‌న్‌ని తెర‌కెక్కించేశారు డైర‌క్ట‌ర్ మ‌ణిర‌త్నం. ఫ‌స్ట్ పార్టుకి 500 కోట్ల‌కు పైగా డ‌బ్బులు వ‌సూలు కావ‌డంతో, సెకండ్ పార్టు మీద కాస్త కాన్‌సెన్‌ట్రేష‌న్ పెంచి, కొన్ని అడిష‌న‌ల్ సీన్లు రాసుకుని షూటింగ్ పూర్తి చేశారు. ప్ర‌స్తుతం గ్రాఫిక్స్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఏప్రిల్ 28న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.

సినిమా రిలీజ్ డేట్‌కి క‌రెక్ట్ గా నెల రోజుల ముందు నుంచే ప్ర‌మోష‌న్లు చేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ట మ‌ణిరత్నం. మార్చి 28న ఈ సినిమాకు సంబంధించి ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌ని అత్యంత భారీగా ప్లాన్ చేస్తున్నార‌ట‌. సౌత్ స్టేట్స్ తో పాటు నార్త్ స్టేట్స్ లోనూ ఈ సారి గ్రాండ్‌గా ఈవెంట్ల‌ను ప్లాన్ చేస్తున్నార‌ట మేక‌ర్స్. ఐశ్వ‌ర్య‌రాయ్‌ని ముందు నిల‌బెట్టి ఈ సినిమాకు నార్త్ లో ఎలివేష‌న్ ఇవ్వాల‌న్న‌ది ప్రైమ‌రీ మేక‌ర్స్ ప్లాన్ అట‌. పొన్నియిన్ సెల్వ‌న్ సెకండ్ పార్టులో ఐశ్వ‌ర్య‌రాయ్ డ్యూయ‌ల్ రోల్స్ లో క‌నిపిస్తారు.

ఫ‌స్ట్ పార్టులో విక్ర‌మ్‌, కార్తి, జ‌యంర‌వి, ఐశ్వ‌ర్య‌రాయ్‌, శోభిత ధూళిపాళ‌, త్రిష కీ రోల్స్ చేశారు. ఇప్పుడు సెకండ్ పార్టులోనూ వీరంద‌రూ కంటిన్యూ అవుతారు.చోళ సామ్రాజ్యం నేప‌థ్యంలో సాగుతుంది పొన్నియిన్ సెల్వ‌న్‌. ఆ దేశ‌పు సిరిసంప‌ద‌లు, రాజ్యంలో జ‌రిగిన కుట్ర‌లు, కుతంత్రాలు, రాచ‌రిక‌పు వ్య‌వ‌స్థ‌, వ‌ర్త‌కం, వ్య‌వ‌సాయం వంటివాట‌న్నిటినీ స‌వివ‌రంగా చూపించ‌డానికి ట్రై చేశారు మ‌ణిర‌త్నం.