English | Telugu

యూట్యూబ్ లో 'పీకే' కొత్త రికార్డులు

రాజమౌళి బాహుబలి వెండితెరపై ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తుంటే..తానేమి తక్కువ కాదంటూ అమీర్ 'పీకే' కూడా తన రికార్డులను ఇంకా కొనసాగిస్తూనే వున్నాడు. అదేంటీ? అమీర్ పీకే ఇండియాలో థియేటర్ల నుంచి ఎప్పుడో ఎత్తివేస్తే ఇంకా రికార్లులు ఎలా వస్తున్నాయని అనుకుంటున్నారా? ఇక్కడే వుంది అసలు మ్యాటర్. మనం అనుకుంటున్నట్టు 'పీకే' వెండితెరపై రికార్డులు కొనసాగించడం లేదు. యూట్యూబ్ లో కొనసాగిస్తున్నాడు. అమీర్ పీకే రిలీజ్ తరువాత యూట్యూబ్ లో ఈ సినిమాపై ఎన్నో స్పూఫ్ లు వచ్చాయి. కానీ వాటన్నిటికి రాని క్రేజ్ ఒక్క 'పీకే 2' స్పూఫ్ కి దక్కింది.

సౌత్ ఇండియా లో ఫేమస్ యూట్యూబ్ ఛానెల్ ఆయిన తెలుగువన్ ఆప్ లోడ్ చేసిన ఈ 'పీకే 2', సౌత్ ఇండియా షార్ట్ ఫిల్మ్స్ లో సంచనాలు సృష్టించింది. కేవలం ఆరు నెలల్లో ఒక కోటీ క్లిక్స్ రాబట్టుకొని సౌత్ ఇండియాలో నెంబర్ వన్ షార్ట్ ఫిల్మ్ గా నిలిచింది. ఈ షార్ట్ ఫిల్మ్ ఇప్పటికే తెలుగు వన్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో విన్నర్ నిలిచింది. ఈ ఫిల్మ్ కి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ రెడ్డి నగదు బాహుమతి కూడా అందుకున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ లో కొత్త రికార్డులు నమోదు చేసిన సందర్భంగా తెలుగువన్ సంస్థ వీరందకి అభినందలు తెలియజేసింది. 'పీకే 2' టీమ్ ఫ్యూచర్ లో మరిన్ని మంచి షార్ట్ ఫిల్మ్ తీయాలని మనం కూడా కోరుకుంద్దా౦.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.