English | Telugu

ఎంత నష్టమో తెలుసా!.. దెబ్బతీస్తే ఊరుకునే ప్రసక్తే లేదు

పాన్ ఇండియా లెవల్లో కొత్త సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు, పైరసీ ఉగ్రవాదులు సదరు చిత్రాలని పలు మార్గాల ద్వారా పైరసీ చేసి కోట్ల రూపాయలని సంపాదిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన తేజ సజ్జ మిరాయ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వన్ మాన్ షో 'ఓజి'(OG)కూడా థియేటర్స్ లో అడుగుపెట్టిన కొన్ని గంటలకే ఆన్ లైన్ లో ప్రత్యక్షమయ్యాయి. రీసెంట్ గా హైదరాబాద్ నగర పోలీసులు కొంత మంది పైరసి ఉగ్రవాదులని అరెస్ట్ చేసారు.

ఈ విషయంపై హైదరాబాద్(Hyderabad)నగర పోలీస్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతు నగరంలో విస్తృతంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారీ మూవీ పైరసీ రింగ్‌ని పట్టుకున్నాం. ఈ ఆపరేషన్‌లో ఐదుగురు కీలక నిందితులని అరెస్టు చేయడంతో పాటు, వారి వద్ద నుంచి కంప్యూటర్లు, హార్డ్‌డిస్కులు, ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ పరికరాలు తదితర సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నాం. ఈ నిందితులు కొత్తగా విడుదలైన తెలుగు, హిందీ, తమిళ సినిమాలని రహస్యంగా రికార్డ్ చేసి, వాటిని ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్స్ ద్వారా అక్రమంగా అమ్మకాలు జరుపుతు కోట్ల రూపాయల లాభాలని ఆర్జిస్తున్నారు. ప్రత్యేక బృందాలు వారాల తరబడి నిఘా ఉంచి,నిందితుల గ్యాంగ్‌ ని పట్టుకున్నాం.

సినిమా పరిశ్రమని దెబ్బతీసే పైరసీ మాఫియాని ఉపేక్షించం. కఠిన చర్యలు ఉంటాయి.ప్రజలు కూడా థియేటర్లలో సినిమాలు చూసి పరిశ్రమని ఆదుకోవాలి. ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి సైబర్ క్రైమ్ పోలీసులు, టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీస్ స్టేషన్ల సిబ్బంది సమన్వయంతో పనిచేసారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, ఈ గ్యాంగ్‌కు సంబంధించి మరిన్ని వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.
ఇది హైదరాబాద్ నగర పోలీసులు పైరసీపై సాధించిన ఒక పెద్ద విజయంగా కూడా పరిగణిస్తున్నారు. పైరసీ ఉగ్రవాదుల వల్ల సినిమా ఇండస్ట్రీకి యేటా 3000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్న విషయం తెలిసిందే.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .