English | Telugu

పవన్ కళ్యాణ్, రాజు సుందరం మూవీ నిజమే

పవన్ కళ్యాణ్, రాజు సుందరం మూవీ నిజమేనని తెలిసింది. వివరాల్లోకి వెళితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రభుదేవా సోదరుడు, ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రాజు సుందరం దర్శకుడిగా ఒక సినిమా రూపుదిద్దుకోనుంది. "ఛత్రపతి" ఫేం బి.వి.యస్.యన్.ప్రసాద్ ఈ సినిమాని నిర్మించనున్నారు. ముందుగా ఈ సినిమాని త్రీడి లో నిర్మించనున్నారని సమాచారం అందగా, అది నిజం కాదనీ, అసలా సినిమానే లేదనీ తెలిసింది.

కానీ మళ్ళీ ఇప్పుడు అది త్రీడి సినిమా కాదనీ, ఫీచర్ ఫిల్మేననీ విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం. యస్, సూర్య, ధరని, విష్ణువర్థన్ వంటి తమిళ దర్శకుల తర్వాత పవన్ కళ్యాణ్ పనిచేస్తున్న మరో తమిళ దర్శకుడు రాజు సుందరం కావటమ విశేషం. "గబ్బర్ సింగ్ ‍" పూర్తయింతర్వాత ఈ చిత్రం ప్రారంభమవుతుందని తెలిసింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.