English | Telugu
"ఎందుకంటే...! ప్రేమంట...!"లో రామ్ న్యూలుక్
Updated : Jan 9, 2012
"ఎందుకంటే ప్రేమంట"లో రామ్ న్యూలుక్ విడుదలయ్యింది. వివరాల్లోకి వెళితే మొన్న విడుదలైన 'కందిరీగ" చిత్రం శతదినోత్సవం జరుపుకుంది. అదే ఊపు మీద తమ స్వంత సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై, రామ్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, "తొలిప్రేమ" ఫేం కరుణాకరన్ దర్శకత్వంలో, స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న విభిన్నప్రేమకథాచిత్రం "ఎందుకంటే...! ప్రేమంట...!". ఈ "ఎందుకంటే...! ప్రేమంట...!" చిత్రంలో హీరో రామ్ ఇంట్రడక్షన్ సాంగ్ స్టిల్ ఒకటి తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు హీరో రామ్.
అది యువతను ఆకట్టుకునే విధంగా ఉంది. చుట్టూతా అమ్మాయిలు మధ్యలో మైక్ పట్టుకున్న రామ్ ఫొటో చాలా ఆకర్షణీయంగా కనిపించింది. ఈ "ఎందుకంటే...! ప్రేమంట...!" చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ మేనల్లుడు జి.వి.ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ "ఎందుకంటే...! ప్రేమంట...!" చిత్రం రానున్న వేసవి శలవులకు విడుదల కానుంది.