English | Telugu

పవన్ 'గోపాల గోపాల' టీజర్ డేట్

వెంకటేష్-పవన్ కళ్యాణ్ నటిస్తున్న మల్టీ స్టారర్ "గోపాల గోపాల" షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన ముఖ్యభాగం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్ నానక్ రామ్ గుడాలో వేసిన సెట్ లో వెంకటేష్, ఇతర నటీ నటులపై వచ్చే ప్రముఖ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్ హిట్ ఓ మై గాడ్ రీమేక్ గా తెరకేక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను వినాయకచవితి రోజు రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ టీజర్ లో మధ్యతరగతి వ్యక్తిగా నటిస్తున్న వెంకటేష్ లుక్ ను రిలీజ్ చేస్తారని సమాచారం. వెంకటేష్ కి జోడీగా శ్రియ నటిస్తున్న ఈ సినిమాకి డాలీ దర్శకత్వం వహిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.