English | Telugu

మెగాస్టార్ న్యూలుక్ ఎలా వుంది?

ఏడేళ్ల నుంచి ముఖానికి రంగు వేసుకోవడం మర్చిపోయిన చిరంజీవి.. ఇప్పుడు మళ్లీ మూడో ఇన్నింగ్స్ మొదలుపెట్టడానికి శరీరాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. రోజుకు మూడు గంటల పాటు జిమ్ లోనే గడుపుతున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ 150 వ సినిమా కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమాకి సంబంధించిన ప్రిప్రొడక్షన్ వర్క్ కూడ శరవేగంగా జరుగుతుంది. తాజాగా చిరంజీవి తన న్యూ లుక్ ఫోటోషూట్ ని కూడా విడుదల చేశారు. తన తండ్రి సినిమాకి తానే నిర్మాతనని చరణ్‌ కూడా ప్రకటించేసుకున్నాడు. ఈ సినిమా డీటేల్స్ రేపు చిరు బర్త్‌డే సందర్భంగా ప్రకటిస్తారని సమాచారం.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.