English | Telugu

ఇల్లు కోల్పోయినా కూడా అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్ బంగారం 

కొన్ని సినిమాలు ఎందుకు హిట్ టాక్ ని పొందలేకపోతాయో అర్ధం కాదు.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆల్బమ్స్ లోని బంగారం కూడా ఆ కోవలోకే వస్తుంది.2006 లో రిలీజ్ అయ్యింది. మీరా చోప్రా, రీమాసేన్ లు హీరోయిన్ క్యాటగిరిలో చేసినా కూడా పవన్ కి మాత్రం జోడిగా చెయ్యలేదు. సూర్య మూవీస్ పై అగ్ర నిర్మాత ఏఎం రత్నం నిర్మించగా తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన ధరణి దర్శకుడుగా వ్యవహరించాడు. ఇక అసలు విషయాన్ని వస్తే బంగారంలో చేసిన ముద్దు గుమ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా నిలిచింది. పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.

సనూషా సంతోష్. బంగారం లో మీరా జాస్మిన్ చెల్లెలుగా చైల్డ్ క్యారక్టర్ లో సూపర్ పెర్ ఫార్మ్ తో ప్రేక్షకుల మెప్పుని పొందింది.ఒక రకంగా చెప్పాలంటే సినిమా కథ కూడా ఆమె చుట్టూనే తిరుగుతుంది. పవన్ ఆమె కోసమే శత్రువులతో యుద్ధం చేస్తాడు. ఇక తాజాగా సనుషా స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో గ్లోబల్ మెంటల్ హెల్త్ అండ్ సొసైటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్‌ ని పూర్తి చేసింది. ఈ మేరకు గ్రాడ్యుయేషన్ హాజరై పట్టా కూడా అందుకుంది. ఇప్పుడు ఈ విషయంపైనే సోషల్ మీడియా లో ఒక పోస్ట్ తో పాటు కొన్ని ఫొటోస్ ని షేర్ చేసింది. నేను ఇల్లు కోల్పోయాను. ఎన్నో సార్లు ఏడ్చాను. నిద్రలేని రాత్రులు గడిపాను. ఎన్నో పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ జాబ్స్ చేశాను. ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చివరికి అనుకున్నది సాధించాను. నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు నా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు.అదే విధంగా అవసరమైనప్పుడల్లా తోడుగా నిలిచిన ఫ్రెండ్స్ కి ధన్యవాదాలు. ఈ విజయాన్ని మీ అందరికీ అంకితమిస్తున్నానని చెప్పింది.

సనూషా బంగారం కంటే ముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళంలో దాదాపు 20 సినిమాలకు పైగానే చేసింది. ఆ తర్వాత 2012లో మిస్టర్ మరు ముకన్ అనే మలయాళ మూవీతోనే హీరోయిన్ గాను పరిచయం అయ్యింది. తెలుగులో రేణిగుంట, జీనియస్‌ వంటి చిత్రాల్లోను నటించి మెప్పించింది. నేచురల్ స్టార్ నాని హీరోగా 2019 లో వచ్చిన జెర్సీ లో నసున్ చివరి సారిగా నటించింది. జర్నలిస్ట్ రమ్య క్యారక్టర్ లో చేసి మంచి పేరునే సంపాదించింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.