English | Telugu

ప‌వ‌న్ తాత‌య్య‌.. ఇప్పుడు విల‌న్‌

అత్తారింటికి దారేదితో తెలుగులో అరంగేట్రం చేశాడు బొమ‌న్ ఇరానీ. అందులో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి తాత‌య్య‌గా న‌టించాడు. ఇప్పుడు మ‌రోసారి బాలీవుడ్ నుంచి ఈ న‌టుడ్ని ఓ తెలుగు సినిమా కోసం దిగుమ‌తి చేస్తున్నారు. ర‌వితేజ‌, సంప‌త్‌నంది క‌ల‌యిక‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం బెంగాల్ టైగ‌ర్‌. ఈ సినిమాలో బొమ‌న్ ఇరానీ విల‌న్‌గా న‌టించ‌నున్నాడు. ఈనెల‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మార్చిలో చిత్రీక‌ర‌ణ మొద‌లు పెడ‌తారు. త‌మ‌న్నా, రాశీఖ‌న్నా క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. బొమ‌న్ కోసం చిత్ర‌బృందం భారీ పారితోషికం వెచ్చించింద‌ట‌. కాల్షీట్లూ అధికంగానే కావ‌ల్సివ‌చ్చిందట‌. తెలుగు నాట మ‌రో కొత్త విల‌న్‌ని చూడ‌బోతున్నామ‌న్న‌మాట‌.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.