English | Telugu

ప‌వ‌న్ డ‌బ్బులు పెట్ట‌లేద‌ట‌

సాయిధ‌ర‌మ్ తేజ్ కెరీర్ వెనుక ఉన్న‌దెవ‌రు..?? వ‌రుస‌గా అవ‌కాశాల మీద అవ‌కాశాలు చేజిక్కించుకోవ‌డానికి కార‌ణ‌మేంటి?? ప‌వ‌న్ క‌ల్యాణ్ అండ‌దండ‌లు ఈ యువ హీరోపై ఉన్నాయా, సాయి కెరీర్‌కి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ మొత్తం.. ప‌వ‌నేనా? సాయి సినిమాల‌కు వెనుక నుంచి డ‌బ్బులు పెడుతున్నాడా? ఇలాంటి ఎన్నో సందేహాలున్నాయి. వాటిపై సాయిధ‌ర‌మ్ తేజ్ స్పందించాడు. ''చిరు మావ‌య్య‌, ప‌వ‌న్ నాగ‌బాబు మావ‌య్య‌ల ఆశీస్సులు నాకున్నాయి. అంతే త‌ప్ప‌... ప‌వ‌న్ మావ‌య్య డ‌బ్బులు పెట్ట‌డం అనేది నిజం కాదు. ఆయ‌న నా సినిమాల‌కు ఎందుకు డ‌బ్బులు పెడ‌తారండీ...?? కాక‌పోతే వాళ్ల ఆశీస్సులు, అండ‌దండ‌లు నాకున్నాయి. అది చాలు..'' అని క్లారిటీ ఇచ్చాడు. చిరు కుటుంబం మొత్తం 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమాని వీక్షించార‌ట‌. అయితే ప‌వ‌న్ మాత్రం ఇంకా చూడ‌లేద‌ట ''కల్యాణ్ మావ‌య్య త్వ‌ర‌లోనే నా సినిమా చూస్తాన‌న్నారు. ఆయ‌న స్పంద‌న కోసం ఎదురుచూస్తున్నా'' అంటున్నాడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.