English | Telugu

లైనప్ అంటే ఇలా ఉండాలి.. ప్రభాస్ ని చూసి నేర్చుకోవాలి!

'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ (Prabhas).. వరుస సినిమాలతో దూసుకుపోవడమే కాకుండా, సినిమాల ఎంపికలో వైవిధ్యం చూపిస్తున్నాడు. ప్రస్తుతం మరే స్టార్ హీరో చేతిలో లేనన్ని సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. పైగా ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా, విభిన్న జానర్ సినిమాలు కావడం విశేషం.

'బాహుబలి' తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలను గమనిస్తే.. సాహో యాక్షన్ థ్రిల్లర్ కాగా, రాధేశ్యామ్ పీరియడ్ రొమాంటిక్ డ్రామా. ఆదిపురుష్ మైథలాజికల్ మూవీ కాగా, సలార్ యాక్షన్ థ్రిల్లర్. ఇక గత చిత్రం 'కల్కి 2898 AD' మైథలాజికల్ టచ్ ఉన్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'రాజా సాబ్' మూవీ చేస్తున్నాడు ప్రభాస్. ఇది రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్. అలాగే హను రాఘవపూడి డైరెక్షన్ లో ఒక చిత్రాన్ని ప్రకటించాడు. ఇది హిస్టారికల్ ఫిక్షన్ మూవీ. దీని తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' అనే సినిమా చేయనున్నాడు ప్రభాస్. ఇది యాక్షన్ ప్యాక్డ్ కాప్ డ్రామాగా రూపొందనుంది. ఇలా విభిన్న జానర్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ప్రభాస్. పైగా ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.