English | Telugu

ఎన్టీఆర్ శ్రీను సమర్పిస్తున్న 'QG' సినిమా తెలుగు రైట్స్ సొంతం చేసుకున్న రుషికేశ్వర్ ఫిలిమ్స్!

జాకీ షరఫ్, సన్నీలియోన్, ప్రియమణి, సారా అర్జున్ ముఖ్య పాత్రల్లో ఫిల్మ్ నటి ప్రొడక్షన్స్, వై స్టూడియోస్ పై వివేక్ కుమార్ కన్నన్ నిర్మించి, దర్శకత్వం వహించిన సినిమా 'క్యూజీ'. మరో నిర్మాతగా గాయత్రి సురేష్ వ్యవహరించారు. ఈ సినిమా తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ రైట్స్ ని సొంతం చేసుకొని నిర్మాత ఎం. వేణుగోపాల్ రుషికేశ్వర్ ఫిలిమ్స్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు. భారీ క్యాస్టింగ్ తో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకుంటోంది.

ఈ సందర్భంగా నిర్మాత ఎం. వేణుగోపాల్ మాట్లాడుతూ.. "ఎంతో హెవీ కాంపిటీషన్లో కూడా ఈ సినిమా తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ రైట్స్ నాకు ఇచ్చినందుకు తమిళ నిర్మాతలకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అదేవిధంగా ఇప్పుడు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. జాకీ షరాఫ్, ప్రియమణి, సన్నిలియోన్, సారా నటన సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. అతి త్వరలో సినిమాని మా మూడు సంస్థల ద్వారా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు కంటెంట్ ఉంటే చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా మంచి విజయాన్ని అందిస్తారు. ఈ సినిమాను కూడా ఆదరించి పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను" అన్నారు.

డ్రమ్స్ శివమణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా అరుణ్ బాత్మనబన్, ఎడిటర్ గా కె.జె. వెంకటరమణన్ వ్యవహరిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.