English | Telugu
"పైసా" లో పొలిటీషియన్ గా నాని
Updated : May 26, 2012
"పైసా" లో పొలిటీషియన్ గా నాని నటిస్తున్నాడట. వివరాల్లోకి వెళితే యెల్లో ఫ్లవర్స్ పతాకంపై, యువ హీరో నాని హీరోగా, కృష్ణ వంశీ దర్శకత్వంలో, రమేష్ పుప్పాల నిర్మిస్తున్న చిత్రం "పైసా". ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాల నేపథ్యంతో సాగే కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారట. ఈ "పైసా" చిత్రంలో హీరో నాని ఒక యువరాజకీయ నాయకుడిగా నటిస్తున్నాడని సమాచారం.
ఈ మధ్య "పైసా" చిత్రంలో హీరో నాని పాత్ర ప్రముఖ యువ రాజకీయవేత్త వై.యస్.జగన్ ని పోలి ఉంటుందనే పుకారు ఫిలింనగర్ లో బాగా వినిపించింది. కానీ అది నిజం కాదనీ, నాని పాత్ర వై.యస్.జగన్ ని పోలి ఉండదనీ ఈ చిత్రం యూనిట్ అంటోందట. ఏది నిజం ...ఏది అబద్ధం అన్నది ఈ చిత్రం విడుదలైతే కానీ తెలియదు.అన్నట్టు ఈ చిత్రానికి "పైసా" అన్నది వర్కింగ్ టైటిలేనట. దీనికి ఈ చిత్రం యూనిట్ "జండాపై కపిరాజు" అన్న పేరుని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం...!