English | Telugu
దిల్ రాజు "కేరింత"
Updated : May 26, 2012
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, సాయిధర్మతేజ హీరోగా, సాయికిరణ్ అడవి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు "కేరింత" అనే చిత్రాన్ని నిర్మించనున్నారట. మెగాస్టార్ చిరంజీవికి మేనల్లుడే ఈ హీరో సాయిధర్మ తేజ. సాయి ధర్మతేజ ఇప్పటికే వై.వి.యస్.చౌదరి దర్శకత్వంలో "రేయ్" అనే చిత్రంలో నటిస్తున్నాడు.
"రేయ్" అతనికి తొలి చిత్రం కాగా "కేరింత" రెండవ చిత్రం అవుతుంది. ఈ "కేరింత" చిత్రంలో ముందుగా నాగచైతన్య హీరోగా నటిస్తాడనుకున్నారు. కానీ నాగచైతన్య డేట్స్ లభించనందువల్ల ఆ స్థానంలో సాయిధర్మ తేజను హీరోగా తీసుకుంటున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ "కేరింత" చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని తెలిసింది.