English | Telugu

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పహల్గామ్ ఉగ్రదాడి బాధితురాలు! భారతీయుల స్పందన ఏంటి!

భారతీయ బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నబిగ్గెస్ట్ ఎంటర్ టైన్ మెంట్ షో 'బిగ్ బాస్'(Big Boss). తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ ఇలా అన్ని భాషల్లోను ఇప్పటికే కొన్ని సీజన్స్ ని పూర్తి చేసుకుంది. త్వరలోనే ఆయా భాషల్లో కొత్త సీజన్స్ ప్రారంభం కానున్నాయి. తెలుగుకి సంబంధించి నాగార్జున(Nagarjuna)హోస్ట్ గా సెప్టెంబర్ 7 నుంచి సీజన్ 9 టెలికాస్ట్ కానుండగా, ఈ నెల 24 నుంచి హిందీలో సల్మాన్ ఖాన్(Salman Khan)హోస్ట్ గా 19వ సీజన్ మొదలుకానుంది.

బిగ్ బాస్ 19 వ సీజన్(Big Boss 19)లో ఎవరు ఊహించని విధంగా కొత్త కంటెస్ట్ లు పాల్గొనబోతున్నారని, నిర్వాహకులు చెప్పుకొస్తున్నారు. అందులో భాగంగా కొత్త కంటెస్ట్ గా ఏప్రిల్ 22 న 'పహల్ గామ్'(Pahalgam)లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో చనిపోయిన 'వినయ్ నర్వాల్'(VInay Narwal)భార్య హిమాన్షి నర్వాల్(Himanshi Narwal)పేరు వినిపిస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియా(Social Media)లో పోస్టర్స్ హల్ చల్ చేస్తున్నాయి. బిగ్ బాస్ ఓటీటీ 2 విజేత ఎల్విష్ యాదవ్‌ కి హిమాన్షి కాలేజీలో స్నేహితురాలు. ఈ కారణంతో కూడా హిమాన్షి ని బిగ్ బాస్ లోకి తీసుకురాబోతున్నట్టుగా వినిపిస్తోంది ఈ వార్తలపై సోషల్ మీడియా వేదికగా పలువురు స్పందిస్తు 'బిగ్ బాస్ షో అనేది పక్కా ఎంటర్ టైన్ మెంట్ షో. ప్రేక్షకులు ప్రతి ఒక్క కంటెస్ట్ ని ఎంటర్ టైన్ మెంట్ కోణంలోనే చూస్తారు. కానీ హిమాన్షి కంటెస్ట్ గా ఉంటే ఆ విధంగా చూడలేరు. విజయ్ నర్వాల్ చనిపోయాక, ఆయన బాడీ ముందు కూర్చొని హిమాన్షి విలపించిన వీడియో,ప్రతి ఒక్క భారతీయుడిని కంటతడి పెట్టించింది. పైగా పహల్ గామ్ ఘటన భారతీయుల జీవితాల్లో చాలా సన్నితమైన అంశంగా ముడిపడి ఉండటంతో, షో లో హిమాన్షి పాల్గొంటే అందరిలో మళ్ళీ భావోద్వేగాలు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో షో ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం కష్టమని, సోషల్ మీడియా మీడియా వేదికగా కామెంట్స్ వినపడుతున్నాయి. సీజన్ 19 లో హిమాన్షి కంటెస్ట్ గా ఉండబోతోందనే న్యూస్, ఫేక్ న్యూస్ అనే వాళ్ళు కూడా లేకపోలేదు.

పహల్గామ్‌లో పాకిస్థాన్ కి చెందిన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇరవై ఆరు మంది చనిపోయారు. ఆ తర్వాత మన సైనికులు ఆపరేషన్ సింధూర్(Operation Sindoor)ని నిర్వహించి దాడి చేసిన ఉగ్రవాదులని తుదముట్టించారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.