English | Telugu

అతనితో బెడ్‌రూమ్‌ సీన్స్‌ చేయడానికి కారణం నా భర్తే!

ప్రస్తుతం థియేటర్లకు గట్టి పోటీ ఇస్తున్న ప్లాట్‌ ఫామ్‌ ఓటీటీ. థియేటర్లలో చూడడం సాధ్యం కాని సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీలో చూసే అవకాశం ఉండడంతో పలు ఓటీటీ సంస్థలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ప్రేక్షకులు కూడా వాటిని ఎంతో ఆదరిస్తున్నారు. అలాంటి ఓటీటీలో రకరకాల కాన్సెప్ట్‌లతో చేసిన వెబ్‌ సిరీస్‌లు ఇటీవలికాలంలో ఎంతో ఆకట్టుకున్నాయి. వాటిలో లస్ట్‌ స్టోరీస్‌ ఒకటి. భిన్నమైన కథలను ఒకేచోట చేర్చి ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందించారు. లస్ట్‌ స్టోరీ మొదటి భాగానికి విపరీతమైన స్పందన లభించడంతో, రెండో భాగాన్ని కూడా విడుదల చేశారు. ఈ సిరీస్‌కు ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినా ఆడియన్స్‌ ఈ కథలకు కనెక్ట్‌ అయ్యారు. తమన్నా, మృణాల్‌ ఠాకూర్‌ లస్ట్‌ స్టోరీస్‌ 2లో రెచ్చిపోయి నటించిన విషయం తెలిసిందే.

నెట్‌ ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ లస్ట్‌ స్టోరీస్‌-2లో నాలుగు కథలు ఉంటాయి. నాలుగు వేర్వేరు కథలను నలుగురు దర్శకులు హ్యాండిల్‌ చేశారు. అయితే ఇందులో విమర్శలతో పాటు ప్రశంసలు అందుకున్న స్టోరీ కొంకణా సేన్‌ తెరకెక్కించిన ‘ది మిర్రర్‌’ ఎపిసోడ్‌. ఈ మొత్తం వెబ్‌ సిరీస్‌కు ఈ ఎపిసోడే హైలెట్‌. కొన్ని సెక్స్‌ సీన్స్‌లో నటించింది ప్రముఖ నటి అమృతా సుభాష్‌ ఇందులో సీమ అనే పనిమనిషి పాత్రలో నటించింది. సెక్స్‌ సీన్స్‌ చేసే సమయంలో ఎంతో ఇబ్బంది పడ్డానని ఇటీవల ఓ కార్యక్రమంలో తెలిపింది. తాజాగా నెట్‌ ఫ్లిక్స్‌ యాక్టర్‌ రౌండ్‌ టేబుల్‌ 2023 కార్యక్రమాన్ని చేపట్టగా.. కరీనా కపూర్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా, సాన్యా, తిలోత్తమ, జైదీప్‌ అహ్లావత్‌తోపాటు అమృత కూడా కార్యక్రమంలో పాల్గొంది.

లస్ట్‌ స్టోరీస్‌ 2లో నటించేటపుడు తన అనుభవాన్ని అమృత వివరిస్తూ ‘స్క్రిప్ట్‌ చదవగానే అందులో ఇంటిమేట్‌ సీన్లు ఉన్నాయని అర్థమైంది. దాంతో భయం వేసింది. నా భర్తగా నటించిన శ్రీకాంత్‌ యాదవ్‌తో ఒకరోజు ఈ సీన్ల గురించి చర్చించాలని కొంకణాతో చెప్పాను. శ్రీకాంత్‌ యాదవ్‌ చాలా ఏళ్లుగా నా బెస్ట్‌ ఫ్రెండ్‌. అతడు నా భర్తకు కూడా స్నేహితుడే. అతడితో ఇలాంటి సీన్లలో నటించాలంటే నేను పడే ఇబ్బంది గురించి నా భర్తతో చెప్పాను. దానికి ఆయన ఇలాంటి సీన్లు నువ్వు చేయగలవని నా భర్తే ప్రోత్సహించాడు. షూటింగ్‌కి ముందు రోజంతా మేం కొంకణాసేన్‌ బెడ్‌రూమ్‌లోనే గడిపాం. చెయ్యాల్సిన సీన్ల గురించి బాగా చర్చించుకున్నాం. సినిమాటోగ్రాఫర్‌ కూడా మాతోపాటు ఉన్నారు’ అని చెప్పింది.