English | Telugu
'దేవర'.. మరో లుక్ కి ముహూర్తం ఫిక్సయిందా!?
Updated : Aug 5, 2023
'జనతా గ్యారేజ్' వంటి సంచలన చిత్రం తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా 'దేవర'. పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో జాన్వికి ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఇక ఇదే సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే 'దేవర' నుంచి తారక్, జాన్వి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేసిన యూనిట్.. మరో ప్రధాన పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయనుందని సమాచారం. విలన్ సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ కి సంబంధించిన ఈ లుక్.. అతని పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 16న రాబోతోందని టాక్. మరి.. సైఫ్ లుక్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరో పది రోజులు వేచి చూడాల్సిందే.
కాగా, 'దేవర' వేసవి కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఈ సినిమాకి కోలీవుడ్ నెంబర్ వన్ కంపోజర్ అనిరుధ్ బాణీలు అందిస్తున్న తెలిసిందే.