English | Telugu

రేజ్ ఆఫ్ భోళా.. ఓ రేంజ్ లో ఉందిగా!

మెగాస్టార్ చిరంజీవి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'భోళా శంకర్' సినిమా.. మరో ఆరు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, మూడు పాటలతో టార్గెట్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన యూనిట్.. తాజాగా 'రేజ్ ఆఫ్ భోళా' పేరుతో థీమ్ సాంగ్ ని రిలీజ్ చేసింది.

ఇందులో భోళా శంకర్ క్యారెక్టరైజేషన్ ని ఆవిష్కరించడమే కాకుండా మాంచి ఎలివేషన్స్ కూడా ఇచ్చారు. మహతి స్వర సాగర్ సంగీతమందించిన ఈ థీమ్ సాంగ్ కి మెహర్ రమేశ్, ఫిరోజ్ ఇస్రాయెల్ సాహిత్యమందించారు. అలాగే అసుర, ఫిరోజ్ ఇస్రాయెల్ (నవాబ్ గ్యాంగ్) ర్యాప్ ఆలపించారు. మరి.. 'రేజ్ ఆఫ్ భోళా'తో సినిమాపై ఆసక్తి పెంచడంలో సఫలమైన యూనిట్.. ఫైనల్ గా ఎలాంటి రిజల్ట్ పొందుతుందో తెలియాలంటే ఈ నెల 11 వరకు వేచిచూడాల్సిందే.

'భోళా శంకర్'లో తమన్నా, కీర్తి సురేశ్, సుశాంత్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా ఏకే ఎంటర్ట్మైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించారు.