English | Telugu
బాలీవుడ్ నటుడికి క్యాన్సర్ భయం
Updated : Jul 21, 2014
జాతీయ విలక్షణ నటుల్లో ఒకరు ఓంపురి. హిందీలో నటనకు అవకాశం వున్న పలు చక్కటి పాత్రల్లో నటించి ఎన్నో అవార్డులు అందుకున్నారు. నటనలో ఎంత ప్రావీణ్యత కనిపిస్తారో, అంతే మక్కువ సిగెరట్ల మీద చూపే ఓంపురి ఆ అలవాటు మానుకుంటున్నారట. ఈ విషయం అంత యాదృశ్చికంగా జరుగలేదు. వివరాల్లోకి వెళితే...
చిన్న తెల్లటి మచ్చలు, నోటిలో, ముఖం మీదా కనపడంటంతో సన్నిహితులు కేన్సర్ పరీక్ష చేయించుకోమని సూచించారట. ఆసుపత్రిలో చికిత్స కోసం చేరగా అది ఇంకా కేన్సర్ కారకంగా మారలేదని తెలిపారట వైద్యులు. కానీ వెంటనే సిగరెట్లు మానేయక పోతే మాత్రం ఆరోగ్యానికి హాని తప్పదు అని సూచించారట. అంతే ఆరోగ్యం మహాభాగ్యం అని ఆసుపత్రిలో చేరాగానే తెలుసుకున్నారట ఓంపురి. వెంటనే సిగరెట్లు తీసి అవతల పారేశాడట. నిముషంలో సిగరెట్లు మానేయటం అంత సులభం కాదు, కానీ ఆరోగ్యం కన్నా విలువైంది ఏది లేదని గ్రహించిన మరుక్షణం ఏ నియమం పాటించడం అయినా అసాధ్యం కాదు.