English | Telugu
గౌతమ్ బర్త్ డేకి మహేష్ స్పెషల్ గిఫ్ట్
Updated : Jul 21, 2014
యువరాజు పుట్టినరోజును ఘనంగా జరుపాలనుకున్న మహేష్ కొడుక్కి ఈ ఏడాది అరుదైన గిఫ్టు ఇవ్వాలనుకుంటున్నాడు. గౌతమ్ పుట్టిన రోజును మరింత గుర్తుండిపోయేలా చేయాలనుకుంటున్నాడు. అందుకే ఆగస్టు 31న గౌతమ్ పుట్టినరోజున 'ఆగడు' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయిస్తున్నాడు. అన్నట్టు జూలై 20న ప్రిన్స్ కూతురు సితార రెండవ బర్త్ డే జరుపుకుంది. ఇక వచ్చేనెల 9న మహేష్ పుట్టినరోజున అభిమానులను సంతోష పెట్టెందుకు 'ఆగడు' చిత్రం ట్రెయిలర్ ను విడుదల చేయనున్నారు.
ఎన్నో హైలెట్స్ తో రూపొందుతున్న చిత్రం 'ఆగడు'. తమన్నా, మహేష్ తొలిసారి జంటగా కనిపిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ స్పెషల్ సాంగ్ అలరించనుంది. ఇక ఈ సినిమా తమన్ సంగీత దర్శకత్వంలో వస్తున్న 50వ చిత్రం. ఇలా ఇన్ని ప్రత్యేకతలున్న ఈ చిత్రం ఆడియో ప్రిన్స్ కొడుకు పుట్టినరోజు విడుదల కావటం కూడా మరో ప్రత్యేకతే అని చెప్పాలి.