English | Telugu

పవర్‌స్టార్‌ జోడీ వచ్చేసింది.. ‘ఓజీ’పై పెరుగుతున్న ఎక్స్‌పెక్టేషన్స్‌!

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, సుజిత్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఓజీ’ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కి ఇంకా టైమ్‌ ఉన్నప్పటికీ సినిమాకి ఉన్న హై ఎక్స్‌పెక్టేషన్స్‌ని దృష్టిలో ఉంచుకొని వరసగా అప్‌డేట్స్‌ ఇస్తున్నారు మేకర్స్‌. ఇటీవల రిలీజ్‌ చేసిన ఓజస్‌ గంభీరకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు మరో అప్‌డేట్‌తో పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్నారు.

ఈ చిత్రంలోని హీరోయిన్‌ పరిచయం చేస్తూ ఒక పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ప్రియాంక మోహన్‌ యాజ్‌ కన్మణి అంటూ ఆ పోస్టర్‌పై మెన్షన్‌ చేశారు. ఈ సినిమాకి సంబంధించి వస్తున్న అప్‌డేట్స్‌తో రోజురోజుకీ భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే కొందరు మాత్రం హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉండడం సినిమాకి కూడా మంచిది కాదనే అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. ఇటీవలికాలంలో చాలా సినిమాలు భారీ హైప్‌ మధ్య రిలీజ్‌ దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు అభిమానులు ఈ తరహా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు ఇచ్చిన అప్‌డేట్స్‌ చూస్తుంటే సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ క్యారెక్టర్‌ ఒక రేంజ్‌లో ఉండబోతోందనేది అర్థమవుతోంది. ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్‌ ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు.