English | Telugu

పాన్‌ ఇండియా మూవీలో విలన్‌గా నరేష్‌.. హీరో, డైరెక్టర్‌ ఎవరో తెలుసా?

‘ప్రేమ సంకెళ్ళు’ చిత్రంతో హీరోగా పరిచయమైన నరేష్‌.. ‘నాలుగు స్తంభాలాట’తో చిత్రంతో పెద్ద సక్సెస్‌ సాధించారు. ఆ తర్వాత కామెడీ ప్రధానంగా రూపొందిన చాలా సినిమాల్లో నటించి సక్సెస్‌ఫుల్‌ హీరో అనిపించుకున్నారు నరేష్‌. కామెడీ ప్రధానంగా ఉన్న సినిమాలే కాకుండా సెంటిమెంట్‌, ఎమోషనల్‌, యాక్షన్‌ సినిమాల్లో కూడా నటించి ఆల్‌రౌండర్‌ అనిపించుకున్నారు. తన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా సక్సెస్‌ సాధించిన నరేష్‌ తాజాగా నారా రోహిత్‌, శ్రీదేవి జంటగా నటించిన ‘సుందరకాండ’ చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్‌ చేశారు. ఈ సినిమా ఆగస్ట్‌ 27న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో ఒక కొత్త విషయాన్ని తెలిపారు నరేష్‌.

‘నేను కామెడీ బాగా చెయ్యగలను అనే పేరు ఆల్రెడీ ఉంది. అలాగే రంగస్థలం చిత్రం నుంచి మంచి ఎమోషనల్‌ క్యారెక్టర్స్‌ కూడా బాగా చెయ్యగలను అనిపించుకున్నాను. నేను చేసే సినిమాల్లో మంచి క్యారెక్టర్స్‌ పడాలని కోరుకుంటాను. నెక్స్‌ట్‌ నేను చేయబోయే సినిమాల్లో మూడు నాలుగు ఎమోషనల్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నాను. అలాగే నాలుగు రసాలను పండిరచే ఒక విచిత్రమైన క్యారెక్టర్‌ కూడా చేస్తున్నాను. అన్నింటినీ మించి ఒక పాన్‌ ఇండియా మూవీలో విలన్‌గా నటించబోతున్నాను. అయితే ఆ సినిమాలో హీరో ఎవరు, డైరెక్టర్‌ ఎవరు అనే విషయాలు ఇప్పుడే నేను చెప్పలేను. ఆ సినిమా మాత్రం చాలా బిగ్‌ రేంజ్‌లో ఉండబోతోంది. వివరాలు త్వరలోనే తెలుస్తాయి’ అన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.