English | Telugu
జపాన్ లో ఎన్టీఆర్ బాద్ షా
Updated : Feb 14, 2014
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన "బాద్ షా" చిత్రం 2013లో విడుదలయిన సంగతి అందరికి తెలిసిందే. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా ఒసాకా ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014లో ప్రదర్శన కానుంది. వచ్చే నెల మార్చి 7 నుండి 16 వరకు జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శనకు మనదేశం నుండి రెండు సినిమాలే ఎంపిక కావడం గమనార్హం. అందులో మరొకటి హిందీ సినిమా "బాగ్ మిల్కా బాగ్". ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ... "ఒసాకా ఫిల్మ్ ఫెస్టివల్ కి సౌత్ ఇండియాలో ఎన్నికైన ఏకైక చిత్రంగా "బాద్ షా" నిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. "బాద్ షా" టీంకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను" అని అన్నారు.